రెంజల్ మండల తహసిదారు ఎదుట 16 మంది బైండోవర్

నవతెలంగాణ- రెంజల్ :
రెంజల్ మండలంలో 16 మందిని తాసిల్దార్ రామచందర్ ఎదుట బైండోవర్ చేసినట్లు రెంజల్ ఎస్సై ఉదయ్ కుమార్ తెలిపారు. రాబోవు ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని గతంలో అల్లర్లను సృష్టించిన వారిని గుర్తించి, వారందరిని సోమవారం బైండోవర్ చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికలు పూర్తయ్యే వరకు శాంతియుత వాతావరణంలో ప్రతి ఒక్కరు సంయమానం పాటించాలని ఆయన సూచించారు. చట్టాన్ని అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన హెచ్చరించారు.