న్యూఢిల్లీ : గడిచిన ఆర్థిక సంవత్సరం 2022-23లో భారత స్థూల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 16.3 శాతం పతనమై 71 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయని ఆర్‌బీఐ గణంకాలు వెల్లడించాయి. ఇంతక్రితం ఏడాదిలో 84.8 బిలియన్ డాలర్ల ఎఫ్‌డీఐలు చోటు చేసుకు న్నాయి. ఇదే సమయంలో 38.6 బిలియన్ డాలర్లుగా ఉన్న నికర ఎన్‌పీఏలు.. 2022-23లో 28 బిలియన్లకు పడిపోయాయని ఆర్‌బీఐ తన తాజా మాసం బులిటెన్‌లో వెల్లడించింది.
తయారీ రంగం, కంప్యూటర్ సర్వీసెస్, కమ్యూనికేషన్ సర్వీసెస్‌లో అధికంగా ఎఫ్‌డీఐలు పడిపోయా యి. అదేవిధంగా అమెరికా, స్విట్జర్లాండ్, మారిషస్ నుంచే వచ్చే పెట్టుబడు ల్లోనూ తగ్గుదల చోటుచేసుకుంది. గతేడాది సెమీకండక్టర్ పరిశ్రమలో అత్యధికంగా 26.2 బిలియన్ల ఎఫ్‌డీఐలు వచ్చాయి. పరిశ్రమల అభివృద్ధికి ప్రభుత్వం చేపడుతున్న చొరవకు అనుగుణంగానే పెట్టుబడులు వస్తున్నాయని ఆర్‌బీఐ పేర్కొంది. గడిచిన ఏప్రిల్‌లో విదేశీ పోర్ట్టుపోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐ)లు ఈక్విటీ సెగ్మెంట్‌లో 1.9 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టారు.