ఉప్పల ట్రస్ట్ ద్వారా 20వేల జంగయ్య కు ఆర్థిక సాయం

 – ఉప్పల ట్రస్ట్ ద్వారా 20వేల జంగయ్య కు ఆర్థిక సాయం అందజేసిన భగీరథ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేష్

నవతెలంగాణ- తలకొండపల్లి
మండల కేంద్రంలో ప్రతి నిరుపేద కుటుంబానికి కల్వకుర్తి నియోజకవర్గం లో ఆపదలో ఉన్న ఆ నిరుపేద కుటుంబానికి నా వంతుగా సహాయం ఉంటుందని రాష్ట్ర మిషన్ భగీరథ వైస్ చైర్మన్ జడ్పిటిసి ఉప్పల వెంకటేష్ అన్నారు. శనివారం రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండల కేంద్రానికి చెందిన వడ్డెర జంగయ్య అనే వ్యక్తి కి గత నాలుగు సంవత్సరాల క్రితం తలకొండపల్లి నుండి ఆమనగల్ రహదారిలో రోడ్డు ప్రమాదంలో కాలు విరిగిపోయి కాలు నడవనికే రాకపోవడంతో శతమాతమవుతుండడంతో ఈ విషయం గ్రామస్తులు రాష్ట్ర మిషన్ భగీరథ వైస్ చైర్మన్ జెడ్పిటిసి ఉప్పల వెంకటేష్ కి తెలియజేయడంతో మూడు చక్రాల బండికి వడ్డెర జంగయ్య ఉప్పల చారిటబుల్ ట్రస్టు ద్వారా రూ,20వేల రూపాయలు ఆర్థిక సాయం తలకొండపల్లి జెడ్పిటిసి తెలంగాణ రాష్ట్ర మిషన్ భగీరథ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ అందజేశారు. ఈ కార్యక్రమంలో బుచ్చిబాబు, రఘువీర్, సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు.