పేపర్ మిల్లు గ్రామంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన 20 మంది యువత

నవతెలంగాణ- రెంజల్: రెంజల్ మండలం పేపర్ మిల్ గ్రామంలో మంగళవారం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మహమ్మద్ షకీల్ అమీర్ సతీమణి ఐయేషా ఫాతిమా ఆధ్వర్యంలో 20 మంది యువత బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ ఫలాలకు వారు ఆకర్షితులై ఈ పార్టీలో చేరినట్లు బీఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షులు అవేజ్ ఖాన్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ హాలియా ఫారుక్ పటేల్, సర్పంచ్ల ఫోరం జిల్లా ఉపాధ్యక్షులు వికార్ పాషా, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు రఫిక్, నీల సింగిల్ విండో చైర్మన్ ఇమామ్ బిగ, సాటాపూర్ ఎంపీటీసీ ఎస్.కె అహమ్మద్, మండల ఉపాధ్యక్షులు హాజీ ఖాన్, పెద్దలు ఖదీర్ పటేల్, యూసుఫ్ పటేల్, సోషల్ మీడియా ఇంచార్జ్ ముఖిద్, స్థానిక యువత తదితరులు పాల్గొన్నారు.