ఎంజి మోటార్‌ అమ్మకాల్లో 21% వృద్థి

న్యూఢిల్లీ : ప్రస్తుత ఏడాది ప్రథమార్థంలో తమ వాహన అమ్మకాల్లో 21 శాతం వృద్థి చోటు చేసుకుందని ఎంజి మోటార్‌ ఇండియా తెలిపింది. 2023 జనవరి నుంచి జూన్‌ కాలంలో దేశంలో 29,000 యూనిట్ల అమ్మకాలు చేయగా.. గతేడాది ఇదే సమయంలో 24,000 యూనిట్ల విక్రయాలు జరిగాయని పేర్కొంది. తమ అమ్మకాల్లో ఎంజి హెక్టార్‌ ఎస్‌యువి, ఎంజి జడ్‌ఎస్‌ ఇవి ప్రధాన వాటా కలిగి ఉన్నాయని తెలిపింది.