– మంత్రి హరీశ్‌రావు ఆదేశాలతో రెండు లక్షల సంఘాలకు లబ్ది
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలోని రెండు లక్షల మహిళా స్వయం సహాయక సంఘాల ఖాతాల్లోకి రూ.217 కోట్లు జమయ్యాయి. డిసెంబర్ 23న స్టేట్ లెవల్ బ్యాంకర్స్ కమిటీ(ఎస్‌ఎల్‌బీసీ) 35వ సమీక్ష సమావేశం సందర్భంగా ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారమే ఎస్‌హెచ్‌జీల రుణాలకు వడ్డీ రేటు అమలు చేయాలని మంత్రి హరీశ్‌రావు ఆదేశించిన విషయం తెలిసిందే. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి, అధికంగా వసూలు చేసిన సొమ్మును వడ్డీతో సహా చెల్లించాలని స్పష్టం చేశారు. మహిళా సంఘాల రుణాలపై ఎంత వడ్డీ వసూలు చేయాలో 2022 జూలై 20న ఆర్బీఐ స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చింది. రూ.3లక్షల వరకు రుణంపై గరిష్ఠంగా 7శాతం, రూ.3 నుంచి 5 లక్షల వరకు రుణంపై 10 శాతం వసూలు చేయాలనీ, ఒక సంవత్సరం ఎంసీఎల్‌ఆర్ ఎది తక్కువైతే దానిని వసూలు చేయాలని సూచించింది.