
ఇటీవల వరదల్లో సర్వస్వం కోల్పోయిన లాకావత్ బికియా కుటుంబానికి బంజారా ఉద్యోగ మరియు కుల సంఘం తరఫున 22 వేల ఆర్థిక సహాయాన్ని ఆదివారం అందించారు. అలాగే ఇటీవల మొద్దుల గూడెం గ్రామంలో ఇల్లు దగ్దం ఐనటువంటి ఇస్లావత్ బుజ్జమ్మ కుటుంబానికి 10000.00 విలువ చేసే కొత్త గ్యాస్ పొయ్యి సిలిండర్ అలాగే నిత్యావసర వస్తువులు ఇవ్వడం జరిగింది. మొన్నటి వరదల్లో సర్వస్వం కోల్పోయిన కుటుంబానికి కాస్త చేయూతను ఇవ్వడం కొసం తాల కాస్త కూడా పెట్టి వారి కుటుంబానికి అందించడం జరిగింది . అలాగే ప్రభుత్వం కూడా వారిని ఆదుకావాలని కుల సంఘం నాయకులు అన్నారు. ఈ కార్యక్రమంలో భూక్యా సక్రు నాయక్, లావుడియ మున్నా, బాబురావు, రాజన్న దేవా నాయక్, సుమలత, మోహన్ రాతోడ్, పన్నం, ఇరు నాయక్, నర్సింహ, బద్రమ్మా, తెజ్యా, నవీన్, పిరమ్మ, రాజేందర్, ఉమేష్, సూర్యం నాయక్ మొదలగు వారు పాల్గొన్నారు.