కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 24 గంటలు కరెంట్, రూ.2లక్షల రుణమాఫీ

– కాంగ్రెస్ పార్టీ మంథని ఎమ్మెల్యే అభ్యర్థి దుద్దిళ్ల
నవ తెలంగాణ మల్హర్ రావు.
కాంగ్రెస్ అధికారంలోకి రాగానే వ్యవసాయానికి 24 గంటల కరంట్,రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ వెంటనే అమలు అవుతుందని జాతీయ కాంగ్రెస్ కార్యదర్శి, తెలంగాణ కాంగ్రెస్ మేనిపేస్టో చైర్మన్, మంథని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి దుద్దిళ్ల శ్రీదర్ బాబు అన్నారు. మండలంలోని మల్లారం, రావులపల్లి గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు అధికంగా పెరిగిన నిత్యావసర సరుకుల ధరలు, పెరిగిన గ్యాస్ ధరలు, పెరిగిన బస్సు చార్జీల నుండి ఉపశమనం కలిగించడానికి.మహిళలకు మహాలక్ష్మి పథకం: ద్వారా ప్రతీ నెల రూ.2,500, కేవలం రూ.500 కే వంట గ్యాస్ సిలిండర్, ఆర్టీసీ బస్సులో మహిళలు ఉచిత ప్రయాణం జరుగుతుందన్నారు.పంట పెట్టుబడి అధికమై సతమతమవుతున్న రైతన్నలను ఆదుకోవడానికి , కౌలు రైతులు, రైతు కూలీల కష్టాలను తీర్చడానికి.రైతు భరోసా పథకం ద్వారా ప్రతీ ఏటా రైతులకు,కౌలు రైతులకు ఎకరానికి ఏడాదికి రూ.15,000, వ్యవసాయ కూలీలకు.రూ.12,000,వరి పంటకు క్వింటాల్ కు రూ.500 బోనస్.ఇస్తుందన్నారు.కరెంటు చార్జీల పెంపుతో ఇళ్లు గడవడం కష్టంగా మారిన ప్రజలకు చార్జీల భారాన్ని తగ్గించేందుకు. గృహ జ్యోతి పథకం ద్వారా ప్రతి కుటుంబానికి ప్రతీ నెల 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందించడం జరుగుతుందన్నారు.డబుల్ బెడ్ రూం ఇళ్ళు కట్టిస్తామని బీఆర్ఎస్ పార్టీ చేతిలో మోసపోయిన తెలంగాణ ప్రజలకు పక్కా ఇళ్లు నిర్మించుకునేందుకు,ఇందిరమ్మ ఇళ్లు పథకం ద్వారా ఇల్లు లేని వారికి ఇంటి స్థలం, ఇంటి నిర్మాణం కోసం రూ.5 లక్షలు ఇస్తామన్నారు.ఉద్యమకారులకు 250 చ.గ ఇంటి స్థలం ఇవ్వడం జరుగుతుందన్నారు.బడి ఫీజులు పెరిగి, ఉన్నత విద్యను అభ్యసించలేక, ప్రభుత్వ బడుల్లో చదువుకునే వెసులుబాటులేక నష్టపోతున్న విద్యార్థులను ఆదుకునేందుకు. యువ వికాసం పథకం ద్వారా పేద విద్యార్థులకు రూ.5 లక్షల విద్యా భరోసా కార్డు.ప్రతీ మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్. పేద ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు, నిస్సహాయ స్థితిలో ఉన్న వారికి, ఆరోగ్య సమస్యలతో భాధ పడుతున్న వారికి ఆసరాగా చేయూత ద్వారా వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, బీడీ కార్మికులు, ఒంటరి మహిళలు, కల్లుగీత కార్మికులు, నేత కార్మికులు, ఎయిడ్స్, ఫైలేరియా బాధితులకు నెలకు రూ.4,000 పింఛన్,పేదలకు రూ.10 లక్షల రాజీవ్ ఆరోగ్యశ్రీ భీమా అమలు చేయడం జరుగుతుందన్నారు.ఈ సంక్షేమ పథకాలు అందాలంటే ఈ నెల 30న జరిగే ఎన్నిక్షల్లో హస్తం గుర్తుకు ఓటువేసి ఆశీర్వదించాలని కోరారు. అలాగే మల్లారం గ్రామంలో ఉన్న తాగునీటి సమస్యను పరిస్కారం చేయడంలో స్థానిక పాలకులు విపలమైయ్యారని ఎంపిపి చింతలపల్లి మలహల్ రావు విమర్శించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బడితేల రాజయ్య,జిల్లా అధ్యక్షుడు ప్రకాస్ రెడ్డి, ఉపాధ్యక్షుడు రాజిరెడ్డి,ఎంపిటిసి ప్రకాష్ రావు, యూత్ అధ్యక్షుడు గడ్డం క్రాoతి,మల్లారం వార్డు సభ్యుడు లింగన్నపేట శ్రీదర్,సింగిల్ విండో డైరెక్టర్ ఇప్ప మొoడయ్య, గ్రామ యూత్ అధ్యక్షుడు లింగన్నపేట రమేష్,రెవెళ్లి లింగయ్య,మాధవరావు,రూపేస్ రావు పాల్గొన్నారు.