ఎస్సి స్టడీ సర్కిల్ నుండి 26 మందికి ఉద్యోగాలు

నవతెలంగాణ – ఆదిలాబాద్ టౌన్
ఇటివల విడుదలైన డీఎస్సి ఫలితాలలో ఆదిలాబాద్ ఎస్సీ స్టడీ సర్కిల్ నుండి 26 మంది ఎంపికైనట్లు ఎస్సీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ డాక్టర్ రమేష్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇందులో స్కూల్ అసిస్టెంట్ లో తొమ్మిది మంది, సెకండరి గ్రేట్ టీచర్ 17 మంది ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ విజయానికి తమకు అన్ని రకాలుగా సహకరిస్తున్న ఎస్సీ అభివృద్ధి శాఖ అధికారి సునీత కుమారి, జిల్లా కలెక్టర్ లను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. ఇటివల 2 ఎకరాల భూమి ప్రభుత్వం కేటాయించబడిందని పేర్కొన్నారు.