మున్సిపల్ కార్మికులకు 26 వేల వేతనం ఇవ్వాలి

– బహుజన లెఫ్ట్ ట్రేడ్ యూనియన్స్ బి ఎల్ టి యు రాష్ట్ర అధ్యక్షులు దండి వెంకట్
నవతెలంగాణ- కంటేశ్వర్
మున్సిపల్ కార్మికులకు కనీస వేతనం 26 వేలు ఇవ్వాలని భోజన లెఫ్ట్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు దండి వెంకట్ డిమాండ్ చేశారు.
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులు నిత్యం ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారని తెలిపారుత. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న సమస్యలనే తెలంగాణ రాష్ట్రంలో సైతం ఎదుర్కొంటున్నారని విమర్శించారు.నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఇంజనీరింగ్ సెక్షన్ లో పని చేసే వాటర్ సప్లయ్ గార్డెన్స్ స్ట్రీట్ లైట్స్ కార్మికుల సమస్యలు పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ దండి వెంకట్ అధికారులు దృష్టికి తెచ్చారు. అనంతరం రాజీవ్ గాంధీ ఆడిటోరియం నుండి పాత కలెక్టర్ కార్యాలయం వరకు ప్రదర్శన నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ కమిషనర్ అలిమ్, మున్సిపల్ ఇంజనీర్ లు వంశీ కృష్ణ,సాగర్,డిఇ సుదర్శన్ రెడ్డి,ఎఈలు ఇనాయత్ కరీం, శంకర్, బిఎల్ టియు జిల్లా అద్యక్షులు కె.మధు, జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల రాజేందర్ యూనియన్ నాయకులు పాల్గొన్నారు.