మోడీ విధానాలకు వ్యతిరేకంగా 26న దేశ వ్యాపిత నిరసనను జయప్రదం చేయండి

– వ్యకాస రాష్ట్ర కార్యదర్శి నారీ ఐలయ్య
నవతెలంగాణ – చండూరు ఈనెల 26న జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో మోడీ అనుసరిస్తున్న కార్మిక కర్షక వ్యవసాయ పేదల వ్యతిరేక విధానాలను నిరసిస్తూ జిల్లావ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు , చేపట్టినట్టు తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి నారీ ఐలయ్య తెలిపారు.
శుక్రవారం గట్టుపల్ మండల కేంద్రంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మోడీ అనుసరిస్తున్న కార్పొరేట్ శక్తులకు ఉపయోగపడే విధానాలను నిరసిస్తూ వివిధ రూపాల్లో జరిగే నిరసన కార్యక్రమాలలో, వ్యవసాయ కార్మికులు రైతులు వివిధ రంగా కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు .
కేంద్రంలో మూడోసారి అధికారులకు వచ్చిన బిజెపి సంకీర్తన ప్రభుత్వం కార్మిక రైతు వ్యవసాయ ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతుందని ఆరోపించారు. ప్రభుత్వ రంగ సంస్థలను కారు చౌకగా విదేశీ కార్పొరేట్లకు అమ్ముతుందని పెట్రోల్, డీజిల్ వంటగ్యాస్ ఇతర నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెంచి ప్రజలపై ఆర్థిక భారాలను మోపిందని అన్నారు అనేక త్యాగాలు చేసి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోల్డ్ గా మారుస్తూ పార్లమెంట్లో ఎలాంటి చర్చ జరగకుండా ఏకపక్షంగా బిజెపి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు. అందరికీ ఉద్యోగ భద్రత కల్పించే హామీని అమలు చేయాలని ఉపాధి హామీ పథకాన్ని పట్టణ ప్రాంతాలకు విస్తరింపజేసి 200 రోజులు , ప్రతి కుటుంబానికి పని కల్పించి పెరుగుతున్న ధరలకు అనుగుణంగా రోజు కూలి 600 రూపాయలు ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఈనెల 26న అన్ని మండల కేంద్రాలతో పాటు జిల్లా కేంద్రంలో జరిగే నిరసన , కార్యక్రమంలో పెద్ద ఎత్తున రైతు కార్మికులతో పాటు ప్రజాసేవ గురి ప్రజాసంఘాలను పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో రైతు సంఘం రాష్ట్ర నాయకులు బండా శ్రీశైలం వ్యవసాయ కార్మిక సంఘం మండల కన్వీనర్ కర్నాటి సుధాకర్, సీఐటీయూ నాయకులు కర్నాటి వెంకటేశం, అచ్చిన శ్రీను, బండారి కృష్ణయ్య బాబు, కుమార్, పబ్బు మారయ్య, యాదయ్య తదితరులు పాల్గొన్నారు.