27న హెలెన్‌ కెల్లర్‌ జయంతి : ఎన్‌పీఆర్‌డీ

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
తమ సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 27న హెలన్‌ కెల్లర్‌ జయంతిని నిర్వహించనున్నట్టు వికలాంగుల హక్కుల జాతీయ వేదిక(ఎన్‌పీఆర్‌డీ) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె వెంకట్‌, ఎం అడివయ్య శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన 143వ జయంతి సందర్భంగా ‘వినికిడి లోపం, ఆటిజం మానసిక వైకల్యం- తీసుకోవాల్సిన జాగ్రత్తలు’ అంశంపై హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో స్మారక సెమినార్‌ను నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. హెలెన్‌ కెల్లర్‌ విద్యా సంస్థల చైర్మెన్‌ పి ఉమ్మర్‌ ఖాన్‌, ఎన్‌పీఆర్‌డీ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. సంబంధిత పోస్టర్‌ను వారు ఆవిష్కరించారు. సెమినార్‌ను ఉమ్మార్‌ఖాన్‌ ప్రారంభిస్తారని తెలిపారు. ఆటిజంపై అసోసియేటెడ్‌ ప్రొఫెసర్‌ సుసన్‌, మానసిక వైకల్యంపై డాక్టర్‌ శ్రీపూజ సిద్దం సెట్టి, వినికిడి లోపంపై ఇమద్‌ఖాన్‌ రుమాని ప్రసంగిస్తారని పేర్కొన్నారు. అతిథులుగా టీఏఎస్‌ఎల్‌పీఏ రాష్ట్ర అధ్యక్షులు నాగేందర్‌ కంకిపాటి, సిమన్‌ డైరెక్టర్‌ సరిత హాజరవుతారని తెలిపారు.