బోర్గం గ్రామంలో శావులం సాయిలు 28వ వర్ధంతి


నవతెలంగాణ రెంజల్: పేద ప్రజలకు అండగా నిలిచి అనేక పోరాటాలు చేసి ఇండ్లు లేని నిరుపేదలకు ఇంటి స్థలాలు ఇప్పించిన ఘనత సేవలను సాయిలుకే దక్కుతుందని,  సీపీఐ(ఎం) రాష్ట్ర నాయకులు ఎం నరేందర్ స్పష్టం చేశారు. గురువారం రెంజల్ మండలం బోర్గం గ్రామంలో సాయిలు 28వ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ నిరుపేద కుటుంబంలో జన్మించిన చావులం సాయిలు అనేక భూ పోరాటాలు చేసి భూములు లేని నిరుపేదలకు భూములు ఇప్పించడం, ఇండ్లు లేని వారికి ఇంటి స్థలాలు ఇప్పించడం జరిగిందని వారన్నారు. ఎడపల్లి, రెంజల్, నవీపేట్ మండలాల్లో అనేక పోరాటాలు చేసిన ఆదర్శనీయుడని, ఆయన భౌతికంగా లేకపోయినా ఆయన ఆశయాలను ముందుకు తీసుకువెళ్తామని వారన్నారు. సమాజంలో ఆయన ఎదుగుదలను ఓర్వలేక హాయ్ నన్ను హత్య చేశారని వారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు రాజేశ్వర్, జిల్లా నాయకులు పుట్టి నడిపి నాగన్న, పార్వతీ రాజేశ్వర్, వడ్డేన్న, పెద్దులు, గోపాల్, సిద్ధపోశెట్టి, లక్ష్మణ్, సంతోష్ ,మన్నె పోశెట్టి, ఆజన్న, తరుణ్ మైసన్న తదితరులు పాల్గొన్నారు.