317 జీవో టీచర్ల దరఖాస్తులు 2,866

– సమర్పణకు రేపటి వరకు అవకాశం
నవతెలంగాణ బ్యూరో- హైదరాబాద్‌
హైకోర్టు ఆదేశాల ప్రకారం 317 జీవో ద్వారా వేరే జిల్లాకు బదిలీ అయిన ఉపాధ్యాయుల నుంచి ఆన్‌లైన్‌లో ఆది వారం నుంచి దరఖాస్తులను పాఠశాల విద్యాశాఖ స్వీకరిం చింది. మొదటి రోజు రాష్ట్రవ్యాప్తంగా 2,866 మంది ఉపా ధ్యాయులు బదిలీల కోసం దరఖాస్తు చేశారని విద్యాశాఖ సంచాలకులు శ్రీదేవ సేన ఒక ప్రకటనలో తెలిపారు. అత్యధి కంగా రంగారెడ్డి జిల్లాలో 195, ఖమ్మం లో 176, కరీంనగర్‌లో 158, హన్మ కొం డలో 144, మహబూబ్‌నగర్‌లో 142, అత్యల్పంగా జోగులాంబ గద్వాల జిల్లా లో 18 మంది దరఖాస్తు చేశారని వివ రించారు. వాటి సమర్పణకు ఈనెల 14వ తేదీ వరకు అవకాశముందని పేర్కొన్నారు. అయితే ఆ టీచర్లకు పూర్వ జిల్లా సర్వీసును పరిగణనలోకి తీసుకుం టామని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఉపాధ్యాయ బదిలీలకు గతంలో 59,909 దరఖాస్తులొచ్చాయి.