
ప్రతి ఏడాది రూ.399 ప్రీమియం చెల్లించి పాలసీలో చేరిన వారికి దాదాపు 10 రకాల ప్రయోజనాలను కల్పిస్తున్నారని సిరిసిల్ల ఇండియ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ మేనేజర్ రాజేందర్ అన్నారు. వీర్నపల్లి మండల కేంద్రంలో గ్రామ పంచాయతి కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన ప్రమాద బీమా శిబిరంలో మేనేజర్ రాజేందర్ పాల్గోని భీమా చేయించి అన్ని రకాల కార్మికులు గానీ వివిధ కులవృత్తులు వారు గానీ పోస్టాఫీస్ లో ఖాతా తెరుచుకుని రూ. 396 తో ప్రీమియం చేస్తే ప్రమాదవశాత్తు మృతి చెందిన ఖాతాదారునికి ఖాతాదారుని నామినికి రూ. 10 లక్షల బీమా లభిస్తుందని అన్నారు.ఏదైనా ప్రమాదంలో మరణించినా, శాశ్వత పాక్షిక అంగవైకల్యం చెందినా, పక్షవాతం వచ్చినా, అంగ ఛేదం జరిగినా రూ.10 లక్షల వరకు చెల్లిస్తారు. అంతేకాకుండా అంత్యక్రియల కోసం రూ.5వేలు కూడా చెల్లిస్తారు. ఇక పాలసీదారుడి పిల్లలకు చదువుల నిమిత్తం రూ.లక్ష పరిహారం అందజేస్తారు. ఒకవేళ గాయపడి ఇన్‌పేషెంట్‌గా చేరితే ఖర్చుల కోసం రూ.60వేలు, అవుట్ పేషెంట్ (ఓపీడీ)గా చికిత్స తీసుకొంటే రూ.30వేలు చెల్లిస్తారు. ఆస్పత్రిలో రోజూవారి నగదు కింద 10 రోజుల వరకు ప్రతిరోజు రూ.1000 చొప్పున చెల్లిస్తారు. దీనితో పాటు రవాణా ఖర్చుల కింద రూ.25వేలు మించకుండా అందజేస్తున్నట్టు అధికారులు తెలిపారు.అనంతరం సర్పంచ్ పాటి దినకర్ పోస్ట్ ఆఫీస్ భీమా ను ప్రజలు అందరు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పాటి దినకర్,బి పి ఎం మల్లేశం, ఎ బి పి ఎం యాకోబు, సిబ్బంది, కార్యదర్శి పురుషోత్తం తదితరులు ఉన్నారు.