పల్లె దావకాన భూమి పూజ

నవతెలంగాణ సైదాపూర్ : మండలం లో పల్లె దావకాన భూమి పూజ శుక్రవారం చేయడం జరిగింది.ఇందులో భాగంగా ఉమ్మడి వెన్నంపల్లి ఆరేపల్లి లస్మన్నపల్లి వెన్నంపల్లి మూడు పల్లెలకు సంబంధించిన పల్లె దావకాన జడ్పీ వైస్ చైర్మన్ గోపాల్ రావు చేతుల మీదిగా భూమి పూజ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీటీసీ సైదాపూర్ ఎంపీపీ ప్రభాకర్ రెడ్డి వెన్నంపల్లి సర్పంచ్ పద్మ రవీందర్ రెడ్డి ఆరేపల్లి సర్పంచ్ ఆవునూరి పాపయ్య లస్మన్నపల్లి సర్పంచ్ రాములు వెన్నంపల్లి సొసైటీ చైర్మన్ బిల్లా వెంకట్ రెడ్డి బి ఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు సోమరపు రాజయ్య వివిధ గ్రామాలకు సంబంధించిన ప్రజాప్రతినిధులు ఉమ్మడి గ్రామపంచాయతీ వార్డు మెంబర్లు ఆశ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Spread the love