నిస్తేజంగా ఉంటే ఏర్పడేది ఫాసిజమే..సుందరయ్య 38వ స్మారకోపన్యాసం

నవతెలంగాణ-హైదరాబాద్ : భారత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి సందర్భంగా 38వ స్మారకోపన్యాసాన్ని హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరుగుతుంది. ఈ సందర్భంగా ‘భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్యం-సవాళ్లు, రాజ్యాగ విలువలు’ అంశంపై లోక్‌సభ రిటైర్డు సెక్రటరీ జనరల్‌ పీడీటీ చారి స్మారకోపన్యాసం చేయనున్నారు.
భారతదేశం సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక ప్రజాతంత్ర రిపబ్లిక్ అని రాజ్యాంగ పీఠిక చెస్తోంది. ‘లౌకిక’, ‘సామ్యవాద’ అన్న పదాలను 1976లో ఆమోదించిన 42వ రాజ్యాంగ సవరణ ద్వారా పీఠికలో పొందుపర్చారు. ఈ పదాలను చేర్చటం ద్వారా ఆరంభంలో మన రాజ్యాంగం లౌకిక రాజ్యాంగం కాదేమో అన్న చర్చకు దారితీసింది. నేడు లౌకికతత్వం అన్న పదాన్ని దూషణగా భావిస్తున్న అతి కొద్దిమంది వ్యక్తం చేసే అభిప్రాయంగా దీన్ని కొట్టిపారేయొచ్చు. రాజ్యాంగ పరిషత్ భారత రాజ్యాంగాన్ని ఆమోదించినప్పుడు పీఠికలో లౌకికతత్వం అన్న పదాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించకపోయినా రాజ్యాంగం దేశం ముందుంచిన ప్రాపంచిక దృక్పధం, ప్రయోగించిన భాష, అవగాహన, లౌకిక స్వభావం భారత రాజ్యాంగంలో అంతర్భాగం అని చెప్పాలి. జవహర్లాల్ నెహ్రూ రూపొందించి 13 డిశంబర్ 1946న ఆమోదానికి పెట్టిన రాజ్యాంగపు లక్ష్యాల తీర్మానం భారత రాజ్యాంగ పీఠికకు పునాది. ఈ పీఠిక భారతదేశం గురించి పూర్తిగా నూతన దృక్పధాన్ని, ప్రపంచం గురించిన తాజా అవగాహనను ప్రజలకు అందించింది. విశాల మానవాళి పట్ల సహోదర భావనలు కలిగి ఉండాలని ప్రేరేపించింది.1950 జనవరి 26 భారతదేశాన్ని లౌకిక ప్రజాతంత్ర గణతంత్ర రాజ్యంగా ప్రకటించిన రాజ్యాంగం భారత చరిత్ర ప్రస్థానంలో ఓ చెప్పుకోదగ్గ మైలురాయి. భారత రాజ్యాంగపు చారిత్రక పాత్రను అర్థం చేసుకోవాలి. విశ్లేషించాలి. ఇదేదో ఒక దేశాన్ని పాలించటానికి కావల్సిన విధి విధానాలు ప్రతిపాదించే పత్రం మాత్రమే కాదు. ప్రపంచంలో అతి పెద్ద లిఖిత రాజ్యాంగం. దేశాన్ని ముక్కులు చెక్కలు చేసిన మూడువేల ఏళ్ల వారసత్వం నుండి ఆధునిక భారతదేశం తనను తాను విడగొట్టుకున్న చారిత్రక సందర్భం, రాజ్యాంగం ఆమోదించుకోనంత వరకూ మనుషులందరూ సమానులు కాదని, పుట్టుకను బట్టే మనుషులను చీల్చిన వారసత్వం గత మూడువేల ఏళ్ల వారసత్వం. దీన్నే సనాతన ధర్మ సాంప్రదాయం అని పిలుస్తారు. ఈ సాంప్రదాయం. భారతదేశంలో అత్యంత క్రూరమైన అసమానతలకు, అణచివేతకు, అన్యాయమైన సమాజ నిర్మాణానికి పునాదులు వేసింది. విశాల జనబాహుళ్యం అంటరానివారని, సామాజికంగా నిమ్నస్థాయికి చెందినవారనీ ఈ సాంప్రదాయం చెస్తోంది. ఈ సనాతన ధర్మ సాంప్రదాయం అన్యాయం, అసమానతలనే సమాజ నిర్మాణానికి పునాదులుగా మల్చుకొన్నది. పవిత్ర గ్రంధాలుగా మనం చెప్పుకుంటున్న గ్రంధాలు అన్ని రకాల అమానవీయ విలువలకు పట్టం కట్టాయి. సమాజాన్ని ఎటూ కదలటానికి వీల్లేని నాలుగు గదులుగా విభజించి ఇది దైవకార్యం అని చెప్పుకుంటే మన శాస్త్రాలు దాన్ని ఆమోదించాయి. ఇటువంటి ధర్మశాస్త్రాలే ప్రాచీన భారతంలో చట్టాలు, ప్రపంచంలో భారతదేశంలో మాత్రమే దేవుడు మానవులంతా సమానం కాదని స్వయంగా ప్రకటిస్తాడు. శాస్త్రాలు, ఇతిహాసాల నుండి రూపొందించిన చట్టాలు అదే తరహాలో అన్యాయమైన, అసమానతలతో కూడిన సమాజాన్ని నిర్మించే సాధనాలుగా మారాయి. భారతీయ సమాజాన్ని అత్యంత క్రూరమైన అణచివేతతో నిండిన సమాజంగా మార్చాయి. మల్చాయి. అటువంటి దేశంలో ప్రజలకు సమానత్వం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం, న్యాయం వంటి భావనలను. అందించిన గ్రంథం భారత రాజ్యాంగం. దేశాన్ని ఆధునికత ముంగిట్లో నిలిపిన గ్రంధం రాజ్యాంగం. ఇదే మన రాజ్యాంగం యొక్క మౌలిక లక్షణం, విశిష్టత, భారతీయతను మూడువేల ఏళ్లపాటు బందీ చేసిన, మనిషన్నవాడు అంగీకరించలేని పాతకాలపు చరిత్ర, వారసత్వం నుండి విడగొట్టుకుని భారతదేశాన్ని ఆధునిక ప్రపంచంలోకి నడిపించిన ఆయుధం రాజ్యాంగం, రాజ్యాంగ నిర్మాతలు ఈ దేశానికి పార్లమెంటరీ ప్రజాస్వామ్యమే మెరుగైన పరిపాలన చట్రం అని తీర్మానించుకోవడం. ఏదో ప్రమాదవశాత్తూ జరిగిందో లేక కాకతాళీయంగా జరిగిందో కాదు, స్వాతంత్ర్యోద్యమ కాలంలోనే స్వతంత్ర భారతదేశం ఏ తరహా ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని, మన పాలనా చట్రం ఎలా ఉండాలి అన్న అంశాలపై స్వాతంత్య్ర సేనానులు లోతుగా చర్చించారు. మంత్రిమండలి ద్వారా పరిపాలన సాగించే పార్లమెంటరీ ప్రజాస్వామ్యమే మెరుగైన సాధనం అని నమ్మారు, మంత్రిమండలి ద్వారా సాగే పాలన ప్రజలకు ప్రత్యక్షంగా ప్రాతినిధ్యం వహించే పార్లమెంట్ కు జవాబుదారీగా ఉంటుందని విశ్వసించారు. కొన్ని మిరుమిట్లు గొలిపి వైవిధ్యానికి విశ్వాసాలకూ, సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలకు దేనికైన భారతదేశాన్ని ప్రాతినిత్య స్వామ్యం ద్వారానే జంగా ఉంచగలమని నమ్మారు. భారతదేశం నిజానికి అవిభా జాతీయ దేశం కాదని అంర్సల్ జాలించేవారు. రాజ్యాల్లో 25 నవంబరు 19495 ముగింపు ఉపన్యాసం చేస్తూ కాంటేష్బర్ “మనమంతా ఒకే జాతి అని చెుటం ద్వారా మనం ఓ అద్భుతమైన భ్రాంతికి లోనవుతున్నాము. దేశమంతా ఒక్క దారి అయితే వందలు వేల కులాలుగా ఎందుకు చీలిపోయింది? జాతి అన్న ఆధునిక సామాజిక, మానసిక అర్ధంలో, భారతదేశం ఓ జాతి కాదు అన్న వాదాన్ని ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిది. ఈ వాస్తవాన్ని గుర్తిస్తేనే మన దేశాన్ని నిక జాతిగా ఎందుకు తీర్చి దిద్దాలి? తీర్చి దిద్దాలంటే ఏమి చేయాలి? అన్న విషయాన్ని అర్ధం చేసుకోగలుగుతాము. ఈ ఇన్ని చేరుకోవాలంటే ఏమి చెయ్యాలి అన్నది గుర్తించే ప్రయత్నం చేస్తాము.” అని చెప్పారు. తర్వాతి కాలంలో భారతదేశంలో పార్వతిక ఓటు హక్కు ఆధారంగా మొదలైన ఆధునిక భారత జాతీయతా నిర్మాణ క్రమంలో ప్రజలు ప్రజాస్వామ్యాన్ని ఆదరిస్తారని చేసింది. దేశాన్ని ఐక్యంగా ఉంచాలంటే ప్రజాస్వామ్యను మెరుగైన సాధనం అని ప్రజలు కూడా నమ్మారు. అప్పటికి దేశంలో అత్యధికులు నిరక్షరాస్యలే. నిరక్షరాస్యులకు సార్వత్రిక ఓటు హక్కు ఇవ్వడం అన్నది మానవ చరిత్రలోనే అత్యంత వైద్య సాహసాలతో కూడిన ప్రయోగం 25 అక్టోబరు 1951 నుండి 21 ఫిబ్రవరి 1952 మధ్య కాలంలో జరిగిన మొదటి సార్వత్రిక ఎన్నికల్లో కేవలం 45 శాతం ఓటర్లు మాత్రమే ఓటు వేసినప్పటికీ భారత ప్రజాతంత్ర చరిత్రలో ఇది అద్భుతమైన తొలి పార్లమెంట్ ఎన్నికలు భారతదేశాన్ని ఉదారవాద, లౌకిక, బహుళ, ప్రజాతంత్ర దేశంగా మలిచే క్రమంలో తిరుగులేని పునాదిని వేశాయి. ఇప్పటి వరకూ భారతీయులు 17 సార్లు లోక్సభ ఎన్నికల్లో ఓటు వేశారు. పద్దెనిమిదోసారి ఓటు వేయటానికి సిద్ధమవుతున్నారు. 17 సార్లు ఎన్నికలు జరిగిన తర్వాత 75 ఏళ్ల స్వతంత్ర భారతం అనేక గొప్పగొప్ప మార్పులకు లోనైన మహత్తర ప్రస్థానంలో, భారత పార్లమెంట్ స్థానం ఏమిటి? పార్లమెంట్ భారతీయ సార్వభౌమత్వానికి రాజ్యాంగం సృష్టించిన అత్యంత శక్తివంతమైన ప్రజాస్వామిక సంస్థ, ప్రజల ఆర్ధిక సామాజిక సాంస్కృతిక జీవితాన్ని మార్చటానికి అనేక చట్టాలు పార్లమెంటు చేసింది. హిందూ చట్టాలను ఆమోదించటం నిజానికి పార్లమెంట్ చేపట్టిన మొదటి విప్లవాత్మక చర్య అని చెప్పాలి. ఎందుకంటే పార్లమెంట్ సవరించి ఆమోదించక ముందు అమల్లో ఉన్న హిందూ చట్టాలు పూర్తి మితవాద ఛాందసంతో నిండినవి. తిరోగామి దృక్పధంతో కూడినవి. చాంధసాన్ని సాంప్రదాయంగా మార్చినవి. పారిశ్రామిక రంగానికి సంబంధించి, కార్మిక రంగానికి సంబంధించి, ఇతర అనేక ఉత్పాదక రంగాలకు సంబంధించి పార్లమెంట్ ఆమోదించిన చట్టాలు, భారత ఆర్ధిక వ్యవస్థను శిఖరాగ్రాన నిలబెట్టిన ప్రభుత్వ రంగం ఏర్పాటుకు సంబంధించిన చట్టాలు, విప్లవాలకేమీ తీసిపోవు. తొలి రోజుల్లో ఈ చట్టాలు ఆమోదించటాన్ని న్యాయస్థానాలు సవాలు చేశాయి. కానీ రాజ్యాంగ సవరణల ద్వారా ఈ సవాళ్లను పార్లమెంట్ అధిగమించింది. ప్రజాతంత్ర భారత నిర్మాణంలో భారత పార్లమెంట్ ఎదుర్కొన్న తొలితరం సవాళ్లు ఇవి. వర్తమానంలో భారత పార్లమెంట్ ఎదుర్కొంటున్న సవాళ్లను మదింపు వేయాలంటే తొలినాళ్ల నుండీ భారతరాజకీయ చట్రాన్ని పరిశీలించాలి. అప్పుడే సమగ్ర అవగాహన ఏర్పర్చుకోవడం సాధ్యమవుతుంది. పార్లమెంట్ స్వయంప్రతిపత్తి కలిగిన సంస్థ అనీ, దానికంటూ కొన్ని ఆలోచనలు ఉంటాయని, పరిస్థితులు ముందుకు తెచ్చే డిమాండ్లను బట్టి స్పందిస్తుందని అనుకుంటాము. నెహ్రూ నిజమైన ప్రజాతంత్రవాది, పార్లమెంట్ నిర్వహణకు దారిదీపం అని చెప్పగలిగిన విధి విధానాలు, నియమ నిబంధనలు నిరంతరం అభివృద్ధి చేసుకుంటూ వచ్చారు. ప్రశ్నోత్తరాల సమయంలో ప్రతిరోజు ఆయన పార్లమెంట్ కు తప్పకుండా హాజరయ్యేవారు. సభ్యులు వేసే ప్రశ్నలకు సంబంధిత మంత్రులు ఇచ్చే సమాధానాలు సంతృప్తికరంగా లేకపోతే ఆయన జోక్యం చేసుకునేవారు. ప్రతిపక్ష సభ్యులు మాట్లాడేందుకు ఎక్కువ అవకాశాలు ఇవ్వాలని పట్టుబట్టేవారు. ప్రతిపక్షం నుండి ఎవరైనా సీనియర్ నాయకుడు మాట్లాడుతూ ఉంటే నెహ్రూ తప్పనిసరిగా సభలో ఉండేవాడు. మంచి ఉపన్యాసం చేసిన ప్రతిపక్ష సభ్యుడిని అభినందించకుండా ఉండేవాడు కాదు. ఒకసారి తొలి లోక్సభ స్పీకర్ మౌలంకర్ నెహ్రూను తన కార్యాలయంలో కలవాలనుకుంటున్నట్లు కబురు పంపాడు. ఆందోళన చెందిన నెహ్రూ తక్షణమే స్పీకర్ కార్యాలయానికి వచ్చాడు. ఎప్పుడు కలవాలన్నా తానే వచ్చి కలుస్తానని చెప్పాడు. లోక్సభ స్పీకర్ ప్రధాని కార్యాలయానికి వెళ్లి కలవడానికి నెహ్రూ అవకాశం ఇవ్వలేదు. ఆరోగ్యకరమైన పార్లమెంటరీ సాంప్రదాయాలకు నెహ్రూ విలువిచ్చాడు అని చెప్పటానికి ఇటువంటి అనేక ఉదాహరణలున్నాయి. ఇటువంటి అలవాట్లు, సాంప్రదాయాలను మేళవించిన భారతీయ పార్లమెంట్ 1960, 70 దశకంలో శక్తివంతమైన, గౌరవప్రదమైన సంస్థగా ఎదిగింది. 1970 దశకంలో భారత రాజకీయాల్లో నిరంకుశధోరణులు అలవర్చుకున్న రాజకీయనాయకులు తెరమీదకు వచ్చారు. నిర్మాణాత్మక రాజకీయాల స్థానంలో స్పర్ధ రాజకీయాలు మొదలయ్యాయి. నెహ్రూశరం రాజకీయనాయకుల్లో కలుపుగోలుతనం, ఉదారత్వం, నిర్మాణాత్మకత, ప్రతిపక్ష సభ్యులతో వ్యవహరించేటప్పుడు గౌరవమర్యాదలు ఇచ్చిపుచ్చుకోవడం. వ్యవస్థలు గౌరనం మౌలిక లక్షణాలుగా ఉండేవి. 1970 దశకం తర్వాత వచ్చిన రాజకీయనాయకులు. ఈ లక్షణాలను కోల్పోయాూరు. దూకుడుగా వ్యవహరించేవారు. విమర్శలు స్వీకరించలేనంత సంకుచిత మనస్తత్వం కలిగినవారు. వేయి ఆలోచనలు వినిపించటానికి వేదికగా ఉండాల్సిన పార్లమెంట్ అధికార సోపానాలకు కేంద్రమైంది. తొలినాళ్లల్లో విలువైన అభిప్రాయాల వ్యక్తీకరణకు కేంద్రంగా ఉన్న పార్లమెంట్ భారత రిపబ్లిక్ మూడు దశాబ్దాలు పూర్తి చేసుకునే నాటికి ఈ లక్షణాన్ని కోల్పోయింది. భారత ప్రజాస్వామ్య ప్రస్థానంలో ఎప్పుడైతే శక్తివంతమైన నాయకుడు అధికారానికొస్తాడో ఆయా సందర్భాల్లో పార్లమెంట్ బలహీనపడుతూ రావటం దురదృష్టకరమైన సందర్భం. రామరాను భారత ప్రజాస్వామ్యం వ్యవస్థాగత ప్రజాసామ్యంగా మనుగడ సాగించటానికి బదులు నాయకత్వానికి కేంద్రంగా మారింది. శక్తివంతమైన నాయకుడికి ఎక్కడలేని ప్రాధాన్యత ఇవ్వటం అలవాటుగా మారిపోయింది. అధినేతల ముందు సాష్టాంగ ప్రమాణం చేసే వేదికగా చట్టసభలు మారిపోయాయి, అధినేత అన్న పదం ప్రజాస్వామిక సంస్కృతిని వ్యక్తం చేసే పదం కానప్పటికీ మన పార్లమెంటేరియన్లు తమ విధేయతను ప్రదర్శించుకోవడానికి అధినేతల అడుగులకు మడుగులొత్తటం మొదలైంది. దీంతో అధిష్టానం ఒక ఆరాధ్య దైవంగా మారింది. పార్లమెంట్ సభ్యులు తమదైన స్వతంత్ర ఆలోచనలను వదులుకుంటూ వచ్చారు. ప్రత్యర్థి రాజకీయాలకు పార్లమెంట్ దంగస్థలంగా మారింది. చర్చలకు సమయం కుదించుకుపోయింది. అవకాశాలు దాదాపు కనుమరుగయ్యాయి. అంతిమంగా అంతరంగిక అత్యవసర స్థితిని విధించిన ప్రభుత్వం ప్రజల రాజ్యాంగ బద్ధమైన ప్రాధమిక హక్కుల అమలును కూడా నిలువరించింది. నిరసన వ్యక్తం చేసిన ప్రజలను పెద్దఎత్తున జైళ్లల్లో కుక్కింది. నేర చట్టాలకు మరింత పదును పెట్టి ప్రజలకు వ్యతిరేకంగా ప్రయోగించే శక్తివంతమైన ఆయుధాలుగా వాటిని మార్చింది. 1975లో అమల్లోకి వచ్చిన అత్యవసర పరిస్థితి మన రాజకీయ వ్యవస్థ పని తీరును అర్థం చేసుకోవడానికి ఓ పెద్ద కొలమానంగా ఉపయోగపడుతుంది. రాజ్యంలో ఇమిడి ఉన్న నిరంకుశత్వ లక్షణాలను అత్యవసర పరిస్థితి తొలిసారిగా ప్రజలకు ప్రజాస్వామ్యానికి పరిచయం చేసింది. హక్కుల హననానికి పాల్పడిన రాజ్యం ముందు ప్రజల నిస్సహాయతను కూడా వెలుగులోకి తెచ్చింది. తన సొంత ప్రజలపై దాడికి రాజ్యం సిద్ధపడినప్పుడు ప్రజలను, ప్రజల హక్కులను కాపాడటంలో పార్లమెంటరీ వ్యవస్థలో ఉన్న బలహీనతలు, ఊగిసలాటను బట్టబయలు చేసింది. మన ప్రజాస్వామ్యం, రాజ్యాంగం గాజు బొమ్మలన్న వాస్తవాన్ని గ్రహించేలా చేసింది. అధినేత తన గొంతుకను మాత్రమే వినేలా పార్లమెంట్ గుంపు స్వరానికి వేదికైంది. వంద కోట్ల ప్రజానీకానికి ప్రాతినిధ్యం వహించే పార్లమెంటు కేవలం రబ్బరు స్టాంపుకు ఎలా పరిమితం చేయగలదో అత్యవసర పరిస్థితి నిరూపించింది. భారత పార్లమెంట్ ముందు నేటికీ ఈ సవాళ్లున్నాయి. ఇంకా చెప్పాలంటే అత్యవసర పరిస్థితి నాటి కంటే పదునైన పార్లమెంట్ ఎదుర్కొంటోంది. పార్లమెంట్ పని చేయటం లేదని ప్రజలందరికీ తెలుసు, దీనికి కారణాలు ఏమిటి ‘అన్న విషయంలో ఎవరి అభిప్రాయాలు వారికున్నాయి. ప్రతిపక్షమే పార్లమెంట్ను పని చేయనీయటం లేదని ఆరోపించే. మేధావులు గణనీయంగానే ఉన్నారు. పార్లమెంటరీ ప్రతిష్టంభన దీర్ఘకాలం కొనసాగితే పార్లమెంటరీ వ్యవస్థపై విశ్వాసం కోల్పోయిన ప్రజలు మరో ప్రత్యామ్నాయ వ్యవస్థ వైపు ఉదాహరణకు అధ్యక్ష తరహా పాలన వైపు మొగ్గటానికి అవకాశం ఉంటుంది. దేశం ఆ పరిస్థితికి చేరుకోవడానికి ముందే అసలు పార్లమెంటరీ ప్రతిష్టంభనకు మూల కారణం ఏమిటన్న వాస్తవాన్ని మనం పరిశీలించాలి. అధ్యయనం చేయాలి. పార్లమెంట్ సమావేశాలు నిర్వహించటం మౌలికంగా ప్రభుత్వ వ్యహారాలను నదుపుకోవడానికి, కాబట్టి పార్లమెంట్ సజావుగా జరిగేలా చూడటం ప్రధానంగా ప్రభుత్వ బాధ్యత. అయితే, ప్రభుత్వ కార్యభారాన్ని మోయటంతో పాటు పార్లమెంట్ అనేక జాతీయ అంతర్జాతీయ ప్రాధాన్యత కలిగిన అంశాలను కూడా చర్చిస్తుంది. ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన పార్లమెంట్ సభ్యులకు అటువంటి చర్చలు చేయటం మౌలిక విధి. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో పాలకపక్షం, ప్రతిపక్షాల గురించి ఒక నానుడి ఉంది. “ప్రతిపక్షం ఏది కావాలంటే అది మాట్లాడొచ్చు. పాలకపక్షం ఏది కావాలనుకుంటే అది చేయొచ్చు” అన్నది ఆ నానుడి కొన్ని విధానాలు, వాటి అమలు విషయంలో పాలక పనికి ప్రతిపక్షానికి మధ్య తీవ్రమైన బేధాభిప్రాయాలు ఉండటం సహజం. అయితే ఈ భిన్నాభిప్రాయాలూ, బేధాభిప్రాయాలూ వ్యక్త చేయటానికి పార్లమెంట్ మాత్రమే వేదికగా ఉండాలి. పార్లమెంట్లో ఎవరికి సంఖ్యాబలం ఉంటే ప్రతిపక్షాలు వాళ్లకు భారతీయ సమాజం ఒక్కటే, వేటికీ అగ్రకులాలు నీళ్లు గోడే బావి నుండి అంటరాని కులాలు నీళ్లు ముట్టకూడదు అన్న అదేశాలు అమల్లో ఉన్నాయి. సాటి మతస్తుల విషయంలోనే మనకు సహనం లేకపోవటమే కుల వ్యవస్త లో కీలక లక్షణం అయినప్పుడు ఈ దేశంలో ఆ కాలంలో ప్రజాస్వామ్యం వేళ్లూనుకున్నది అంటే ఎలా నమ్మాలి? ఇదే భారతీయ సమాజ నిరంతరం ఎదుర్కొంటున్న సమస్య రాజ్యాంగం మన దేశానికి ఓ ప్రజాస్వామిక సౌధాన్ని అందించింది. కానీ అది నుండి కార్యనిర్వాహణి వర్గం రకరకాల రూపాల్లో పౌర స్వేచ్ఛను హరిస్తూనే ఉంది. భారతీయ సమాజంలో నిరంకుశత్వ పోకడలు బాహాటంగా వ్యక్తమవుతున్న తరుణంలో పౌరస్వేచ్ఛపై ఉక్కుపాదం మోపటం కార్యనిర్వాహక వర్గానికి మరింత తేలికైన పనిగా మారింది. వెరసి నిరంకు లక్షణాలు కలిగిన వాళ్ల చేతుల్లో అధికారం కేంద్రీకృతమయ్యేందుకు మార్గం తేలికైంది. గత 12 ఏళ్లుగా భారతదేశంలో జరుగుతున్న ప్రజాస్వామిక ప్రయోగాన్ని జాగ్రత్తగా గమనిస్తే రానురాను ప్రజాస్వామ్యం పల్చబడుతోందని నిర్ధారణ అవుతుంది.. లౌకిక సమాజంలో లౌకిక సూత్రాల ఆధారంగానే ప్రజా సమీకరణ జరగాలి. దీనికి భిన్నంగా సాగే సమీకరణ అ ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమే. ఈ మధ్యకాలంలో తీవ్రవాద జాతీయత, మతతత్వం ఆధారంగా ప్రజా సమీరణ జరుగుతోంది. ధార్మిక భావనల్లో కూరుకుపోయిన దేశంలో మతం ఆధారంగా ప్రజలను సమీకరించట చాలా తేలికైన పని. వర్తమానంలో భారత రాజకీయాలు లౌకిక వ్యతిరేక ధోరణులను సంతరించుకుంటున్నాయి. సంఖ్యాధిపత్యం కలిగిన మతస్తులు తమ మత అస్తిత్వాన్ని బాహాటంగా ప్రకటించుకునేందుకు రూకుడుగా ప్రయత్నం. చేస్తున్నారు. పాతకాలపు ఛాందసత్వాన్ని పునరుద్ధరించాలన్న బలమైన అభిప్రాయం ఓ తరగతి ప్రజల్లో గూడుకట్టుకుని ఉంది. దాన్ని ప్రభుత్వం వివిధ రూపాల్లో ప్రోత్సహిస్తోంది. ప్రేరేపిస్తోంది. ఈ అభిప్రాయాలకు ప్రేరణగా నిలుస్తోంది. చరిత్రలో జరిగాయని చెప్తున్న తప్పులను సరి చేయటానికి ఈ మనోభావాలు కలిగిన ఓ తరగతి ప్రజలు, వారికి దన్నుగా నిలుస్తున్న ప్రభుత్వం ఆ ప్రయత్నం చేస్తోంది. తాము ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించటాని ఓ దైవదూత ఉద్భవిస్తాడన్న నమ్మకానికి ప్రజలు రానురానూ చేరువవుతున్నారు. మెజారిటీ మతస్తులు లౌకిక భావనలకు, బహుళత్వానికి నీళ్లొదులుతున్నారు. దాని స్థానంలో ఒకే మతం, ఒకే భాష, ఒకే సంస్కృతి అన్న భావనలను ఒంట బట్టించుకుంటున్నారు. ఎప్పటికప్పుడు కొత్త కొత్త నినాదాలు ఇస్తూ ఆ ధోరణిని మరింత ప్రేరేపించేందుకు ఉన్న ఏ చిన్న అవకాశాన్నీ జారవిడుచుకోకుండా పాలకులు. ప్రయత్నిస్తున్నారు. ఈ కొత్తకొత్త నినాదాలు తరచూ అద్భుతమైన గతకాలపు చరిత్ర గురించే ఉంటాయి. చరిత్ర తెలియని రోజుల్లో భారతదేశం ఏక ఖండ సాంస్కృతిక సమాజంగా ఉండేదన్న వాదనలు బలంగా ముందుకు తేబడుతున్నాయి. భారతీయ సాంస్కృతిక వారసత్వం ఏకోన్ముఖమైనదేనన్న తప్పుడు వాదనలకు పాలకులు కొమ్ము కాస్తున్నారు. అటువంటి ఎజెండాలను రూపొందించి ప్రజలపై రుద్దటం ఈ మధ్యకాలంలో కీలకమైన రాజకీయ ఎజెండగా మారింది. 1950 నుండి.. భారతదేశం అనుభవిస్తున్న లౌకిక ప్రజాస్వామ్యం ఎదుర్కొంటున్న నిజమైన సవాలు ఇదే. ప్రజల హక్కులు కాలరాచే క్రూర చట్టాలను ప్రభుత్వాలు శక్తివంతంగా అమలు చేస్తూ వస్తున్నాయి. బుల్డోజర్లు, తప్పుడు ఎన్ కౌంటర్లు ప్రజాస్వామ్యానికి పునాదులైన శాసనబద్ధమైన పాలన కుప్పకూలడాన్ని సూచిస్తున్నాయి. ప్రభుత్వం అమలు చేసే క్రూర చట్టాల కంటే కూడా ప్రమాదకర స్థాయికి బుల్డోజర్ న్యాయం చేరుకుంది. భారతీయ సమాజం లౌకికేతర సమాజంగా మారటం అన్నది దేశం ఎదుర్కొంటున్న ముఖ్య సవాళ్లల్లో ఒకటి. ఈ దేశం లౌకిక దేశంగా ఉంటేనే మనుగడ సాగించగలుగుతుంది. నిజమైన లౌకికతత్వం అంటే ప్రభుత్వానికి ఏ మతమూ అధికారిక మతం కాదు. ప్రభుత్వం ఏ మతాన్నీ ప్రోత్సహించదు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 27 ప్రకారం ఏ పౌరుడూ ఫలానా మతాన్ని ప్రచారం చేయటానికి పన్ను కట్టాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం సేకరింంచే పన్నులు ద్వారా ఏదో ఒక మతాన్ని ప్రచారం చేయకూడదు. ప్రభుత్వ పాఠశాలలు, ఎయిడెడ్ పాఠశాలల్లో ధార్మిక బోధనలు బోధించకూడదు. అని రాజ్యాంగంలోని ఆర్టికల్ 30 ఘోషిస్తోంది. రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వానికి ఏ మతమూ ఉండకూడదనీ, ఏ మతాన్ని ప్రభుత్వం ప్రోత్సహించకూడదనీ రాజ్యాంగంలోని ఈ రెండు అధికరణాలూ ఆదేశిస్తున్నాయి. కొంతమంది భారతదేశాన్ని ధార్మికరాజ్యంగా మార్చాలని కలలు కంటున్నారు. గట్టి విశ్వాసంతో ఉన్నారు. మత ఛాందస రాజ్యం అంతిమంగా భారతదేశాన్ని ఛిన్నాభిన్నం చేస్తుందన్న వాస్తవాన్ని మనం గుర్తించాలి. ఈ విషయాన్ని ఘంటాపథంగా చెప్పటానికి రెండు కారణాలున్నాయి. ఈ దేశంలో ఆరు అల్పసంఖ్యాక మతాలున్నాయి. అందులో ఓ మతాన్ని విశ్వసించే వారు కనీసం 20 కోట్లమంది ఉన్నారు. అందువలన ఈ దేశాన్ని ఏకమత ఛాందన రాజ్యంగా మార్చటం దాదాపు అసాధ్యం. ఇది మొదటి కారణం. ఇక రెండో కారణం ఏమిటంటే మన దేశంలో ఆధిపత్య మతం ఎంత క్రూరమైనదంటే
అధికారం లేదని ఈ తీర్పు స్పష్టం చేస్తుంది. అందువలన ఒకవేళ పార్లమెంట్ లో మూడింట రెండువంతుల మెజారిటీ ఉంది కాబట్టి ఈ దేశాన్ని ధార్మిక రాజ్యంగా మార్చేద్దామని పాలకపక్షం అనుకున్నా కేశవానంద భారతి తీర్పును తిరస్కరించే మరో తీర్పు రావాలి. అది కూడా కేశవానంద భారతి కేసు లో నిర్ణయం తీసుకున్న సుప్రీం కోర్టు ధర్మాసనంలో 13 మంది న్యాయమూర్తులు ఉంటే ఈ తీర్పును తిరస్కరించే ధర్మాసనంలో అంతకన్నా ఎక్కువ మంది న్యాయమూర్తులు ఉండాలి. అయితే నేడున్న పరిస్థితుల్లో ఏదీ అసాధ్యం అనుకోవడానికి లేదు. ఒకవేళ కేశవానంద భారతి తీర్పును మరో ఉన్నత ధర్మా కొట్టేస్తే అప్పుడు ఇష్టం వచ్చినట్లు రాజ్యాంగాన్ని సవరించేందుకు పార్లమెంట్ కు పూర్తి అధికారాలు వస్తాయి. పార్లమెంట్ లో సంఖ్యాబలం ఉన్న ప్రభుత్వాలు ప్రస్తుత రాజ్యాంగాన్ని రూపురేఖలు కనిపించకుండా. మార్చేయగలుగుతాయి. ఆ స్థాయిలో సవరించబడిన రాజ్యాంగం అధ్యక్ష తరహా పాలనకు ఆమోద ముద్ర వేయవచ్చు: పార్లమెంట్ సభ్యులను ఎన్నుకునే స్థానంలో సవరించబడిన రాజ్యాంగం ఆమోదిస్తే ప్రజలే నేరుగా దేశాధ్యక్షుడిని ఎన్నుకోవచ్చు… అంటే దేశాన్ని నిరంకుశత్వం వైపు నడిపించటానికి రాజ్యాంగ బద్ధంగానే రంగం సిద్ధం చేయవచ్చు. ఈ దేశాన్ని నిరంకుళు పాలన దిశగా నడిపించటానికి కొత్త రాజ్యాంగమూ అక్కర్లేదు. కొత్త రాజ్యాంగాన్ని తయారు చేసే రాజ్యాంగ పరిషత్త అక్కర్లేదు. ఎందుకంటే ఉన్న రాజ్యాంగాన్ని సవరించటం ద్వారా ఈ లక్ష్యాలు నెరవేర్చుకోవచ్చు. సవరణ అంటే ఉన్నవి. సవరించటం, అదనపు అంశాలు చేర్చటం కూడా సవరణలో భాగమే. అందవల్ల కేశవానంద భారతి తీర్పు రద్దయిపోతే పార్లమెంట్లో సంఖ్యాబలం ఉన్న పాలకపక్షం కోరుకుంటే పార్లమెంటరీ ప్రజాస్వామ్యం స్థానంలో అధ్యక్ష తరహా పాలన అని రాజ్యాంగాన్ని సవరించవచ్చు. పార్లమెంట్కు జవాబుదారీగా ఉండే కేబినెట్ తరహా ప్రభుత్వానికి తావులేకుండా చూడొచ్చు. మరో విషయం కూడా సాధ్యమయ్యే అవకాశాలున్నాయి. ప్రస్తుతం ఉన్న అధికరణాల్లో ఓ మోస్తరు మార్పులు చేస్తే ఈ దేశాన్ని ఇప్పటికిప్పుడు ధార్మిక రాజ్యంగా ప్రకటించేయవచ్చు. పైన పరిస్థితుల్లో అంటే కేశవానంద భారతి తీర్పును కొట్టేసే మరో తీర్పు వస్తే అప్పుడు రాజ్యాంగాన్ని ఏ విధంగా కావాలంటే ఆ విధంగా మల్చుకునేందుకు కావల్సిన పూర్తి అధికారాలు పార్లమెంట్కు దఖలు పడతాయి. అటువంటి పరిస్థితుల్లో పార్లమెంటే ఫలానా మతం అధికారిక మతం అని ఓ సవరణ చేసేయొచ్చు. అన్యమతస్తులకు ఉన్న ప్రాధమిక హక్కులను రద్దు చేయవచ్చు లేదా కుదించవచ్చు. మత రాజ్యంలో అన్ని మతాలకూ సమాన హక్కులు ఉండవు. భారతీయ మధ్యతరగతికి కుల వ్యవస్థకు కంచె కట్టి మరీ కాపాడే ధర్మ శాస్త్రాలు నూతన రాజ్యాంగానికి అనువైన సూత్రాలుగా కనిపించటంలో ఆశ్చర్యం లేదు. ఈ మధ్యతరగతే చరిత్రలో సవర్ణులుగా ఉండి. అందివచ్చిన అన్ని అవకాశాలను ఉపయోగించుకుని నేడు స్థితిమంతులయ్యారు. హెూదాలు దక్కించుకున్నారు.. సంపన్నులయ్యారు. భారతీయ సమాజాన్ని నిరంతరం శాసిస్తోంది సవర్ణులే. తమ హక్కులు, అధికారాలు కాపాడే ధార్మిక రాజ్యం, రాజ్యం పట్ల వీరు సహజంగానే మొగ్గు చూపుతారు. నేడు అధికారంలో ఉన్న పార్టీకి సైద్ధాంతిక పునాది సమకూరుస్తున్న ఓ కీలకమైన బృందానికి లౌకికతత్వం అంటే మింగుడు పడదు. లౌకికేతర ఆధిపత్య మత రాజ్యం కావాలని ఉవ్విళ్లూరుతున్నారు. ధార్మిక చిహ్నాలను బాహాటంగా ఉపయోగించటం, రాజకీయ చర్చల్లో ధార్మిక భావనలు, చిహ్నాలు, వాదనలు గుప్పించటం, అన్యమతస్తులపై అర్థంలేని ద్వేషాన్ని పెంచి పోషించటం, చారిత్రక పొరపాట్లను సరిదిద్దాలన్న తపనతో ఓ మతాన్ని లేదా ఓ సమూహాన్ని శతృవుగా పరిగణించటం వంటివన్నీ భారతదేశం మతాధిపత్య రాజ్యంగా మారటానికి ఎంతో కాలం పట్టదన్న వాతావరణాన్ని కల్పిస్తున్నాయి. రాజ్యాంగ విలువైలన లౌకికతత్వం, స్వేచ్ఛ, సమానత్వం, సామాజిక న్యాయం. వంటివాటిని చిటికెనవేలుతో తీసేయగల సామర్ధ్యం ఉన్న శక్తులు ఇవి. రానున్నకాలంలో పరిణామాలు ఏ మలుపు తీసుకుంటాయో ఇప్పుడే చెప్పలేము. పాలకులకు చరిత్ర అంటే గౌరవం: లేదు. విలువ అంతకన్నా లేదు. తమ వాదనలు నెగ్గించుకోవడానికి వీలుగా తప్పుడు చరిత్రను సృష్టించటానికి వాస్తవాలను తలకిందులు చేయటానికి కూడా నేటి పాలకులు సర్వదా సన్నద్ధులే. ఏదిఏమైనా సుదీర్ఘకాలం ఈ ప్రాచీన భూభాగం మీద నివశిస్తున్న ప్రజలు ఇటువంటి శక్తుల పట్ల కరుకుగానే వ్యవహరించారు. ప్రజాస్వామ్యం విలువ ఏమిటో ప్రజలకు అర్ధమైతేనే ప్రజాస్వామ్యం, రాజ్యాంగ విలువలు కాపాడుకోవడానికి కదం తొక్కుతారు. మన చుట్టూ జరుగుతున్న అనేక పరిణామాలు మన స్వేఛ్ఛా స్వాతంత్ర్యాలను హరిస్తున్నా మనం స్పందించలేని స్థితికి చేరుకున్నాము. నాగరికత ప్రస్థానంలో ఏ ఒక్క తరం నిస్తేజంగా మారినా ఫాసిస్టు రాజ్యం ఏర్పడే ప్రమాదం పొంచి ఉంటుంది. ఇదే నేటి లౌకిక ప్రజాంత్ర గణతంత్ర భారతం ఎదుర్కొంటున్న అతి పెద్ద సవాలు.

Spread the love