రెడ్డిపల్లి బీఆర్ఎస్ గ్రామ గ్రామ కమిటీ ఏకగ్రీవం

నవతెలంగాణ-వీణవంక : మండలంలోని రెడ్డిపల్లి గ్రామ బీఆర్ఎస్ శాఖను శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.  గ్రామ అధ్యక్షుడిగా ఇట్టవేన రాజయ్య, ఉప అధ్యక్షుడిగా గుంటి అశోక్, కార్యదర్శిగా పోతుల సురేష్, సంయుక్త కార్యదర్శిగా ఏలుబాక రాజయ్య, కోశాధికారిగా గొట్టుముక్కుల వీరా రెడ్డి లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అలాగే అనుబంధ కమిటీలను కూడా ప్రకటించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తామని రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పోతుల నరసయ్య, ఎంపీటీసీ వడ్డేపల్లి లక్ష్మి భూమయ్య సీనియర్ నాయకులు, వార్డు మెంబర్లు అడిగోప్పల సత్యనారాయణ, మాడ రవీందర్ రెడ్డి, ఉయ్యాల రాజు, చింతల సుమన్, చింతల రాజయ్య, చింతల విజయ రాజు, పిఎసిఎస్ డైరెక్టర్ చెకబండి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Spread the love