– ఇచ్చి విచారణ చేయవచ్చు
నవతెలంగాణ-హైదరాబాద్
డ్రగ్స్ కేసులో సినీ నటుడు నవదీప్‌ను విచారణ చేయాలని భావిస్తే పోలీసులు ముందుగా అతనికి సీఆర్‌పీసీ సెక్షన్ 41ఏ నోటీసులు జారీ చేయాలని హైకోర్టు ఆదేశించింది. నవదీప్‌ను పోలీసులు విచారించవచ్చనీ, అయితే, అరెస్టు వంటి కఠిన చర్యలు తీసుకోరాదని చెప్పింది. గుడిమల్కాపూర్ పోలీసు స్టేషన్ పరిధి డ్రగ్స్ కేసులో పోలీసులు 13 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు నమోదు చేసిన కేసులో నవదీప్ వినియోగదారుడిగా పేర్కొన్నారు. అతడిని త్వరలోనే అరెస్ట్ చేస్తామని చెప్పారు. దీంతో నవదీప్ ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టును ఆశ్రయించగా న్యాయమూర్తి జస్టిస్ సురేందర్ బుధవారం విచారించారు. డ్రగ్స్ వినియోగదారుడిగా రిమాండ్ రిపోర్టులో ఉందనీ, సరఫరాదారుడిగా పేర్కొనలేదని ఆయన న్యాయవాది చెప్పారు. దీనిపై పూర్తి దర్యాప్తు జరిగాకే నవదీప్ పాత్ర తేలుతుందని పోలీసులు చెప్పారు.