ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణి చేసిన ఎమ్మెల్యే

నవతెలంగాణ-కంటేశ్వర్
నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ బిగాల 59 మంది బాధితులకు 23,00,000/- రూ. ల సీఎంఆర్ఎఫ్ ముఖ్యమంత్రి సహయనిధి చెక్కులని క్యాంపు కార్యాలయం లో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గణేష్ బిగాల మాట్లాడుతూ..
ఆరోగ్య తెలంగాణ ప్రభుత్వ ధ్యేయం అని తెలిపారు. ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారి సారథ్యం లో అన్ని ప్రభుత్వ ఆసుపత్రి లలో మెరుగైన ఆరోగ్య సేవలు అందిస్తున్నామన్నారు.అత్యవసర సమయాల్లో ప్రయివేట్ ఆసుపత్రి లో చికిత్స పొందిన వారు సీఎంఆర్ఎఫ్ దరఖాస్తు చేసుకోండి.59 మందికి 23 లక్షల రూ. సీఎంఆర్ చెక్కులని బాధితులకు పంపిణీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వ ఆస్పత్రిలలో మెరుగయిన వైద్య సదుపాయాలు కల్పించి నాణ్యమైన వైద్యాన్ని ప్రజలకి అందిస్తున్నాము. బస్తి ధవాఖానాలలో ఉచితంగా రక్తం, మూత్ర ఇతర వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేస్తున్నాము. కంటి వెలుగు పథకం ద్వారా ప్రజలకి కంటి పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు, కళ్ళ జోడు లని అందిస్తున్నాము. నిజామాబాద్ నగర ప్రజలు అత్యవసర వేళల్లో ప్రయివేటు ఆస్పరిలో చికిత్స పొందిన వారు తమ కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ కి సంబంధీత బిల్లులతో దరఖాస్తు చేసుకున్నట్లయితే వారికి వీలయినంత సహాయాన్ని అందిస్తాము అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ శ్రీమతి దండు నీతూ కిరణ్, నుడ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి బీఆర్ ఎస్ కార్పొరేటర్ లు/నాయకులు పాల్గొన్నారు.