వీణవంకలో 48 మంది బైండోవర్

నవతెలంగాణ-వీణవంక : త్వరలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలల్లో భాగంగా వివిధ కేసుల్లో ఉన్న నిందితులను 48 మందిని గురువారం తహసీల్దార్ తిరుమల్ రావు ఎదుట బైండోవర్ చేసినట్లు వీణవంక ఎస్సై ఎండీ ఆసీఫ్ తెలిపారు. ఈ మేరకు ఆయన గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఎన్నికలు సజావుగా సాగేందుకు ప్రతీ ఒక్కరూ సహకరించాలని కోరారు.