
మంత్రాలు చేస్తున్నారని నెపంతో మహిళను గొంతు కోసి చంపేందుకు ప్రయత్నించిన వ్యక్తికి గురువారం ఐదు సంవత్సరముల జైలు శిక్ష విధించిన సంఘటన మండలంలో నెలకొంది. స్థానిక పసర పోలీస్ స్టేషన్ ఎస్ఐ షేక్ మస్తాన్ కథనం ప్రకారం పసర పోలీసు స్టేషన్ పరిధి లోని 2019 లో నమోదు కాబడిన ఈ కేసు లో ముద్దాయికి ములుగు జిల్లా అసిస్టెంట్ సెషన్స్ జడ్జ్ పి మాధవి 5 సం సాధారణ జైలు శిక్ష విధించడం జరిగిందన్నారు. తేదీ 26.6.2019 నాడు నిందితుడు భానోత్ మోగిలి S/O జంపయ్య R/O మచపూర్ అను అతను మంత్రాలు చేస్తు తన చెల్లెలి సమస్యలకు కారణం అవుతుందనే నెపం తో బాధితురాలు వదనాల సరోజన D/O మల్లయ్య R/o మచపూర్ ను కత్తితో గొంతు కోయగా ఆమె మొత్తుకోవటం తో మోగిలి పరిపోవటం జరిగింది. బాధితురాలి తల్లి వదనాల సులోచన ఫిర్యాదు మేరకు అప్పటి పసర ఎస్సై పీ..మహేందర్ కుమార్ కేసు నమోదు చేయగా, ఇన్ని రోజులు కోర్ట్ విచారణ నడిచిన అనంతరం గురువారం పబ్లిక్ ప్రాసిక్యూటర్ సిహెచ్. సత్యనారాయణ వాదనలు విన్న అసిస్టెంట్ సెషన్స్ జడ్జి పీ. మాధవి ముద్దాయికి 5 సం జైలు శిక్ష విధించారు. ములుగు జిల్లా గౌరవ కోర్ట్ లనందు ప్రత్యేక కోర్ట్ మానిటరింగ్ సెంటర్ ఏర్పాటు చేసి ఎప్పటికపుడు ఈ సెంటర్ ద్వారా విచారణ లో ఉన్న కేసులను పర్యవేక్షిస్తూ నిందితులకు శిక్ష పడేలా చేస్తున్న ములుగు జిల్లా ఎస్పీ గౌస్ ఆలం కి ఎస్సై మస్తాన్ కృతజ్ఞతలు తెలియచేపారు. అదేవిధంగా ముద్దాయికి శిక్ష పడేందుకు కృషి చేసిన పసర సి ఐ శంకర్ కి ఎస్సై షేక్ మస్తాన్ కి కోర్ట్ డ్యూటీ ఆఫీసర్ బి. గిరివాసు కి జిల్లా SP గౌస్ అలం అభినందనలు తెలియచేసారు.