
నవతెలంగాణ – మీర్ పేట్
ముఖ్యమంత్రి కేసీఆర్ మీర్ పేట్ కార్పొరేషన్ అభివృద్ధికి 50 కోట్ల రూపాయలు మంజూరు చేసినందుకు మీర్ పేట్ మున్సిపల్ కార్పోరేషన్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు అర్కల కామేష్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మహేశ్వరం నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత, నిరంతరం ప్రజా శ్రేయస్సు కోరుకునే మనందరి అభిమాన నాయకురాలు సబితా ఇంద్రారెడ్డి కోరిక మేరకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జిల్లా మెడికల్ కాలేజీని మహేశ్వరం నియోజకవర్గానికి మంజూరు చేయడం సంతోషంగా ఉందని అన్నారు. ప్రతి గ్రామానికి రూ 15 లక్షలు, మీర్ పేట్ కార్పొరేషన్ రూ 50 కోట్లు, బడంగ్పేట్ కార్పొరేషన్ రూ 50 కోట్లు, జల్పల్లి మున్సిపాలిటీకి రూ 25 కోట్లు, తుక్కుగూడ మున్సిపాలిటీకి రూ 25 కోట్లు, తుక్కుగూడలో సబ్ స్టేషన్ మంజూరు చేశారని, తెలంగాణ రాష్ట్రం అభివృద్ధికి బిఆర్ఎస్ పార్టీ కట్టుబడి ఉందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి కోసం మరోసారి బిఆర్ఎస్ పార్టీని ప్రజలు ఆదరించాలని విజ్ఞప్తి చేశారు.