టీఎస్ఆర్ టిసి 1500 కోట్ల బడ్జెట్ను విడుదల చేయాలి

నవతెలంగాణ – అడిక్ మెట్
టీఎస్ఆర్టిసిని రక్షించి, 1500 కోట్ల బడ్జెట్ను విడుదల చేయాలని తెలంగాణ స్టేట్ ఆర్టీసీ బహుజన వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి  సుద్దాల సురేష్ డిమాండ్ చేశారు. మంగళవారం ఇందిరాపార్క్ ధర్నాచౌక్ లో ధర్నాలో ఆయన మాట్లాడుతూ… టి ఎస్ ఆర్ టి సి లో పూర్తి సమయం ఎన్నికలను వెంటనే నిర్వహించి ప్రభుత్వం రావాల్సిన రియంబర్స్మెంట్  670 కోట్ల డబ్బులను వెంటనే విడుదల చేయాలన్నారు. డీజిల్ రేటు పై వ్యాటును ప్రభుత్వమే భరించి, స్పేర్ పార్ట్స్ పై వ్యాట్ ను తగ్గించాలన్నారు. సిసిఎస్ బకాయిలను, ఎస్ఆర్బిఎస్ సిబిటి బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేశారు. 2013 కు చిన్న బాండ్స్ చెల్లించి కార్మికులపై పని భారాన్ని తగ్గించాలని, రాష్ట్రవ్యాప్తంగా అన్ని రోడ్లు సర్వే చేసి సరైన రన్నింగ్ టైం ఇవ్వాలన్నారు. 2019 నుంచి రావాల్సిన డిఎ ఏరియర్స్ వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. 2017 నుండి 21 వరకు సంబంధించిన పేస్కేల్ చేయాలన్నారు. ఈ ధర్నాలో నాగేశ్వర్, రవీందర్, శ్రీనివాస్ గౌడ్, వెంకటేష్, సురేఖ, రేణుక, గీతరాణి తదితరులు పాల్గొన్నారు.

 

Spread the love