విదేశాలకు రాఖీ సర్వీసుల్లో 50% రాయితీ : డీహెచ్‌ఎల్‌

ముంబయి : అంతర్జాతీయ ఎక్స్‌ప్రెస్‌ కోరియర్‌ ప్రొవైడర్‌ అయినా డీహెచ్‌ఎల్‌ ఎక్స్‌ప్రెస్‌ వచ్చే రాఖీ పండగ సందర్బంగా ప్రత్యేక ఆఫర్‌ను అందిస్తున్నట్టు తెలిపింది. విదేశాలకు రాఖీలను పంపే వారికి 50 శాతం వరకు తగ్గింపును ఇస్తున్నట్టు పేర్కొంది. 0.5 కేజీ నుండి 2.5 కేజీల బరువు నుంచి 20 కేజీల బరువున్న గిఫ్ట్‌ షిప్‌మెంట్‌ల మీద 31 ఆగస్టు 2023 వరకు 700 పైగా రిటైల్‌ స్టోర్‌లలో డిస్కౌంట్‌ అందుబాటులో ఉంటుందని పేర్కొంది. ఈ ప్రత్యేక ఆఫర్‌ రాఖీ, బహుమతులను పంపించడం ద్వారా దూరంగా ఉన్న కుటుంబాలను దగ్గర చేయడానికి ఉద్దేశించబడిందని తెలిపింది.