– బరిలో నిలుపుతాం: జీ. చెన్నయ్య
– ఎస్సీ వర్గీకరణ కు వ్యతిరేకంగా రెండో రోజు జంతర్ మంతర్‌లో మాలమహానాడు ధర్నా
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
ఎస్సీ వర్గీకరణ ఆందోళనకు మద్దతు తెలపడాన్ని మాల మహానాడు జాతీయ అధ్యక్షులు జీ. చెన్నయ్య తీవ్రంగా ఖండించారు. ఇందుకు నిరసనగా రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తమ్ కు వ్యతిరేకంగా 500 మంది మాలలను బరిలో నిలిపి ఓడిస్తామన్నారు. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా జంతర్ మంతర్ లో మాలమహానాడు ఆధ్వర్యంలో రెండో రోజు ఆందోళన చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమంలో మాల మహానాడు జాతీయ అధ్యక్షులు చెన్నయ్య, తెలంగాణ అధ్యక్షుడు శ్రీధర్, ఏపీ అధ్యక్షుడు బిళ్ళా చెన్నయ్య ఇతర మాల మహానాడు నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అంతకుముందు ఎస్సీవర్గీకరణకు వ్యతిరేకిస్తూ తెలంగాణ భవన్ లోని అంబేద్కర్ విగ్రహానికి చెన్నయ్య మెమోరాండం ఇచ్చారు.
ఈ సందర్భంగా చెన్నయ్య మాట్లాడుతూ… వర్గీకరణకు ఏ పార్టీ అనుకూలంగా వ్యవహరించిన మాలల ఆగ్రహాన్ని రుచి చూస్తాయని హెచ్చరించారు. గతంలో మంద కష్ణతో కలిసి వర్గీకరణ కు అనుకూలంగా నిర్ణయం తీసుకున్న చంద్రబాబు ను, టీడీపీ ని భూ స్థాపితం చేసామన్నారు. రానున్న రోజుల్లో ఎస్సి వర్గీకరణకు వ్యతిరేకంగా తమ పోరాటాన్ని మరింత ఉధతం చేస్తామని చెప్పారు.
ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా రాజకీయ పార్టీల మద్దతు కూడగడుతున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా త్వరలోనే బీఎస్పీ అధినేత్రి మాయావతిని కలవబోతున్నట్లు వెల్లడించారు.