కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 500 రూపాయలకే సిలిండర్

– అర్గుల్లో గడపగడపకు కాంగ్రెస్ కార్యక్రమాన్ని నిర్వహించిన మాజీ ఎమ్మెల్సీ భూపతిరెడ్డి

నవతెలంగాణ -జక్రాన్ పల్లి
కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలోనికి వస్తే 500 రూపాయలకే సిలిండర్ అందజేస్తామని మాజీ ఎమ్మెల్సీ భూపతిరెడ్డి శనివారం అన్నారు. మండలంలోని అర్గుల్ గ్రామంలో గడపగడపకు కాంగ్రెస్ పథకమని కార్యక్రమాన్ని నిర్వహించారు. అర్గుల్ గ్రామంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగురవేశారు. అర్గుల్ గ్రామంలో మాజీ ఎమ్మెల్సీ భూపతిరెడ్డి ప్రతి ఇంటి ఇంటికి వెళ్లి కాంగ్రెస్ పథకాలను వివరించారు. అదేవిధంగా టిఆర్ఎస్ చేస్తున్న మోసాల గురించి ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో  ఎంపీటీసీ వనిత పార్టీ మండల అధ్యక్షుడు  చిన్నారెడ్డి మండల యువజన విభాగం అధ్యక్షుడు వినోద్, మండల ప్రధాన కార్యదర్శి బంగ్లా వసంతరావు, జిల్లా కాంగ్రెస్ నాయకులు మండల కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.