బసవేశ్వర విగ్రహ ప్రతిష్టాపన కోసం 5000 రూపాయలు చందా

నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండల కేంద్రంలో బసవేశ్వర విగ్రహ ప్రతిష్టాపన కోసం లింగాయత్ సమాజ్ కుల పెద్దలు ప్రముఖుల దగ్గర చందా రూపంలో సహకారం కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం నాడు మద్నూర్ మండల కేంద్ర సింగిల్ విండో కార్యదర్శి జే బాబురావు విగ్రహ ప్రతిష్టాపన కోసం 5000 రూపాయలు చంద రూపంలో కుల పెద్దలకు అందజేశారు. ఏళ్ల తరబడి విగ్రహ ప్రతిష్టాపన ఏర్పాటు పెండింగ్లో ఉండటం సరి అయింది. కాదని లింగాయత్ సమాజ్ కుల పెద్దలతో మాట్లాడి విగ్రహ ప్రతిష్టాపన కోసం ప్రముఖుల నుండి సహాయ సహకారాలు అందించడానికి చందా కోరుతున్నట్లు పెద్దలు తెలిపారు. విగ్రహ ప్రతిష్టాపన కోసం 5000 రూపాయలు అందజేయాలని సింగిల్ విండో కార్యదర్శి జే బాబురావు కు లింగాయత్ సమాజ్ పెద్దలు కోరడం పెద్దల మాట దించకుండా 5000 రూపాయలు చందా రాసిన కార్యదర్శి కి సమాజ్ పెద్దలు అభినందించారు. ఈ కార్యక్రమంలో శంకర్రావు మారుతి పటేల్ శివాజీ అప్ప తదితరులు పాల్గొన్నారు.