ఎమ్మెల్యే సీతక్క 51వ జన్మదిన వేడుకలు..

నవతెలంగాణ -గోవిందరావుపేట
ములుగు నియోజకవర్గ ఎమ్మెల్యే సీతక్క 51వ జన్మదిన వేడుకలను మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పాలడుగు వెంకట కృష్ణ ఆధ్వర్యంలో ఆదివారం మండల కేంద్రంలోనీ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా నాయకులు ప్రజాప్రతినిధులు కార్యకర్తల హర్షద్వానాల మధ్య కేక్ కట్ చేసి సితక్కకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపి కేక్ పంచుకున్నారు. ఈ సందర్భంగా వెంకటకృష్ణ మాట్లాడుతూ సీతక్క 51వ జన్మదినోత్సవం సందర్భంగా జన్మదిన శుభాకాంక్షలు మరో మారు తెలియజేస్తూ, సీతక్క  కృషి, పట్టుదల, సేవా దృక్పథం, మానవత్వం అనే ఆయుధాలతో దేశం గర్వించదగ్గ గొప్ప నాయకురాలు అయ్యారని, ప్రతిపక్ష నాయకురాలిగా అధికార పార్టీపై ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ ప్రజల అభిమాన నాయకురాలు అయ్యారని అన్నారు. మంచితనం, మానవత్వం అనే సద్గుణాలతో అందరికీ అమ్మలా ఆరాధించబడుతుందని అన్నారు. కష్టం ఉన్న ప్రతి కుటుంబానికి అండగా నిలబడి, సమస్య ఉన్న ప్రతి గ్రామానికి చేరుకొని అంచెలంచెలుగా ఎదిగి అందరి గుండెల్లో సుస్థిర స్థానం ఏర్పరుచుకుని, ప్రజా సమస్యలే పరమావధిగా, ప్రజల కోసం నిరంతరం, నిర్విరామంగా కృషి చేస్తూ జీవితం గడుపుతున్న సీతక్క  కి మరొక సారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని, భవిష్యత్తులో అత్యున్నత హోదాలను అందుకోవాలని, నిత్యం ప్రజల సమస్యలపై పోరాటం చేసే ఆరోగ్యాన్ని ప్రసాదించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అని అన్నారు.
   ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ పన్నాల ఎల్లారెడ్డి మండల ఇంఛార్జి కొంపెల్లి శ్రీనివాస్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ రసపుత్ సీతారాంనాయక్, సీనియర్ నాయకులు సూరపనేని నాగేశ్వర్ రావు, ఎస్.సి.సెల్ జిల్లా అధ్యక్షులు దాసరి సుధాకర్, కిసాన్ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి జంపాల ప్రభాకర్, యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు పెండెం శ్రీకాంత్, జిల్లా నాయకులు కణతల నాగేందర్ రావు, ఎస్టీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య సారయ్య, మహిళా కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పడిగ పార్వతి, మండల ఉపాధ్యక్షులు తేళ్ల హరిప్రసాద్, ఎంపీటీసీ చాపల ఉమాదేవి – నరేందర్ రెడ్డి, గుండెబోయిన నాగలక్ష్మి – అనిల్ యాదవ్, గోపిదాసు ఏడుకొండలు, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు చింత క్రాంతి, బీసీ సెల్ మండల అధ్యక్షులు కాడబోయిన రవి, ఎస్టీ సెల్ మండల అధ్యక్షులు భూక్య రాజు, మహిళా కాంగ్రెస్ మండల అధ్యక్షురాలు మద్దాలి నాగమణి, సహకార సంఘ పాలకవర్గ సభ్యులు జెట్టి సోమయ్య, సర్పంచులు లావుడియా లక్ష్మి – జోగ నాయక్, భూక్య సుక్య, ఉపసర్పంచ్ బద్దం లింగారెడ్డి, గ్రామ అధ్యక్షులు బొల్లు కుమార్, వేల్పుగొండ ప్రకాష్, తండా కృష్ణ, పాడ్య రాజు, జంపాల చంద్రశేఖర్, గోపిదాసు వజ్రమ్మ, సూదిరెడ్డి జయమ్మ, పులుసం లక్ష్మి, చొప్పదండి వసంత, పంగ శ్రీను, దేపాక కృష్ణ, యణమద్దిని శ్రీనివాస్, పొన్నం సాయి, గుండె శరత్, గోపిదాసు మధు, కోరం రామ్మోహన్, దాసరి సాహిత్, జనగాం శ్యామ్, పెండెం తేజ, మిరియాల కృష్ణ, వేల్పుల సాంబయ్య, రమేష్, ఎట్టి ప్రవీణ్, మద్దినేని వినయ్, బాలరాజు, చింతపండు లక్ష్మీనారాయణ, నద్దునూరి రతన్, జాటోత్ చంద్రకాంత్, దారావత్ ఉష, సామ శ్రీలత తదితర నాయకులు పాల్గొన్నారు.