6 గ్యారంటీ పథకాలను ఆకర్షించే భారీగా కాంగ్రెస్ లో చేరికలు

– కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నాగం సుధాకర్ రెడ్డి
నవతెలంగాణ – నూతనకల్
రాష్ట్ర పరిపాలనలో మార్పు రావాలి కాంగ్రెస్ గెలవాలని నినాదంతో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా ఇచ్చిన 6 గ్యారంటీ పథకాలను ఆకర్షించే వివిధ పార్టీలకు చెందిన నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో కాంగ్రెస్ లో చేరుతున్నారని ఆ పార్టీ మండల అధ్యక్షుడు నాగం సుధాకర్ రెడ్డి అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో మండల పరిధిలోని వెంకేపల్లి గ్రామ ఉపసర్పంచ్ సై రెడ్డి సుధీర్ రెడ్డి తో పాటు వార్డు మెంబర్లు,,బి అర్ యస్ బిజెపి నుంచి కాంగ్రెస్ లో చేరారు. నూతనంగా పార్టీలో చేరిన వారికి పార్టీ కండువాను కప్పి సాధారణంగా ఆహ్వానించారు. ఎన్నికలలో ప్రతి కార్యకర్త శక్తి వంచన లేకుండా కష్టపడి కాంగ్రెస్ అమలు చేయబోయే పథకాలను ప్రజలకు వివరించి గెలుపు కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని అన్నారు పార్టీలో చేరిన వారిలో
,8వ వార్డు మెంబర్ దూదిగామ్ సుశీల అంజయ్య 9 వార్డు మెంబర్ గంగాధరి మహేశ్వరి సురేష్ ,బిజెపి నాయకులు బత్తుల శ్రీశైలం గౌడ్ , బిఆర్ఎస్ సీనియర్ నాయకులు దామెర్ల సైదులు ,పాల్వాయి శ్రీనివాస్ , బాతుక పాపయ్య , వీరితోపాటు సుమారుగా 20 కుటుంబాల చేరినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు తోణుకునూరు సైదులు గౌడ్ వెంకేపల్లి గ్రామ శాఖ అధ్యక్షులు కుంట చంద్ర రెడ్డి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.