– రాష్ట్ర పౌర, సమాచారశాఖ కమిషనర్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
కంటి వెలుగు రెండో దశ కార్యక్రమంలో భాగంగా శనివారం నాటికి 63 లక్షల 82 వేల మందికి పరీక్షలు నిర్వహించారు. ఈ మేరకు రాష్ట్ర పౌర, సమాచారశాఖ కమిషనర్ ఒక ప్రకటన విడుదల చేశారు. 11 లక్షల 40 వేల మందికి రీడింగ్ గ్లాసెస్ ఉచితంగా అందజేశారు. 40 ఏండ్లు పైబడిన వారిలో దగ్గరి చూపు, 50 ఏండ్లు పైబడిన వారిలో మోతబిందు (కాటరాక్ట్) సమస్యలు ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయి. గ్రేటర్ హైదరాబాద్‌లో ప్రస్తుతమున్న 256 బస్తీ దవాఖానాలే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా 141 మున్సిపాల్టీల్లో 288 బస్తీ దవాఖానాలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నది. ప్రభుత్వ చర్యలతో 2014లో లక్ష ప్రసవాలకు 92గా ఉన్న మాత మరణాలు 56కు, 39గా ఉన్న శిశు మరణాలు 23కి, ఐదేండ్లలోపు చిన్నారుల మరణాలు 41 నుంచి 30కి, బాలింతల మరణాలు 25 నుంచి 16కు తగ్గాయి. ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవాలు 30 శాతం నుంచి 56 శాతానికి పెరిగాయి.