ఆల్మట్టిలోకి 70వేల క్యూసెక్కులు

అమరావతి : కృష్ణానదిపైన ఆల్మట్టి డ్యామ్‌కు వరద నీరు వస్తోంది. శుక్రవారం నాటి గణాంకాల ప్రకారం ఆల్మట్టి డ్యామ్‌లోకి 70 వేల క్యూసెక్కుల నీరు వస్తున్నాయి. ఆల్మట్టి పూర్తి స్థాయి సామర్థ్యం 129.72 టిఎంసీలు కాగా ప్రస్తుతం 38.40 టిఎంసీల నీరు వుంది. అలాగే తుంగభద్ర డ్యామ్‌లోకి 13,340 క్యూసెక్కులు వస్తోంది. తుంగభద్ర డ్యామ్‌ పూర్తి స్థాయి సామర్థ్యం 105.79 టిఎంసీలు కాగా ప్రస్తుతం 13.72 టీఎంసీల నీరు వుంది. శ్రీశైలం, నాగార్జునసాగర్‌లలో ఇప్పటికీ డెడ్‌ స్టోరేజ్‌ స్థాయిలోనే నీటి మట్టాలు వున్నాయి. శ్రీశైలం పూర్తి స్థాయి సామర్థ్యం 215 టీఎంసీలుకాగా ప్రస్తుతం 33.58టీఎంసీలు, నాగార్జునసాగర్‌ 312 టీఎంసీలకు గాను 144టీఎంసీల నీరు మాత్రమే వుంది. అలాగే పులిచింతలలో 45. 77 టీఎంసీలకుగాను 16.88టీఎంసీలు మాత్రమే వున్నాయి. గత ఏడాది జూలై నాటికే కృష్ణానదిపై వున్న ప్రాజెక్టులన్నీ పూర్తిస్థాయి నీటి మట్టాలకు చేరుకోవడం గమనార్హం.