
మండలంలోని చేపూరు గ్రామ శివారు క్షత్రియ ఇంజనీరింగ్ కళాశాలలో ఆదివారం 75వ ఎన్ సి సి దినోత్సవాన్ని పురస్కరించుకొని పన్నెండవ తెలంగాణ ఎన్ సి సి బెటాలియన్ సూచనల మేరకు మొక్కలను నాటడం జరిగింది. ఈ సందర్భంగా చిట్టాపూర్ గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ ఎర్రం నరసయ్య 2008 ఆగస్టు 15న చైనా భారత్ పాకిస్తాన్ సరిహద్దు అయినటువంటి లడక్ లో ఆపరేషన్ ఏవియేషన్ రక్షక్ వీధులలో భాగంగా హెలికాప్టర్ పేలి చనిపోవడం జరిగిందని, కావున ఈ సందర్భంగా తెలంగాణ బెటాలియన్ సూచనల మేరకు కళాశాలలో తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేసినారు …ఈ కార్యక్రమంలో కళాశాల చైర్మన్ అల్జాపూర్ శ్రీనివాస్, సెక్రెటరీ కరస్పాండెంట్ అల్జాపూర్ దేవేందర్, ప్రిన్సిపాల్ ఆర్కె పాండే, వైస్ ప్రిన్సిపాల్ నరేందర్, ఎన్సిసి అధికారి వెంకటేష్, చిట్టాపూర్ సర్పంచ్ వనజ గోవర్ధన్ గౌడ్ ,ఉప సర్పంచ్ రాజేందర్ వార్డు సభ్యులు నరేష్, వీరయ్య, రాజమల్లు, ఎర్రం నరసయ్య తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.