ఎమ్మెల్యే రసమయి ఎన్నికల ప్రచారం…

నవతెలంగాణ-బెజ్జంకి :
మండల పరిధిలోని తోటపల్లి, వీరాపూర్, లక్ష్మీపూర్ గ్రామాల్లో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ సోమవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా అయా గ్రామాల బీఆర్ఎస్ నాయకులు, గ్రామస్తులు డప్పుచప్పుల్లు, బతుకమ్మలు, బోనాలు, పూలతో ఘనస్వాగతం పలికారు. లక్ష్మీపూర్ గ్రామంలో పలువురు బీఆర్ఎస్ పార్టీలో చేరగా ఎమ్మెల్యే రసమయి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వనించారు. అయా గ్రామాల సర్పంచులు బోయినిపల్లి నర్సింగరావు, గన్నమనేని అనిత, ముక్కీస తిరుపతి రెడ్డి, మండల బీఆర్ఎస్ నాయకులు, అయా గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.
బాధిత కుటుంబానికి పరామర్శ..
లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన ముక్కీస శేఖర్ రెడ్డి ఇటీవల ఆనారోగ్య కారణాలతో మృతిచెందిన విషయం విధితమే. బాధిత కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Spread the love