ఎయిర్‌పోర్టులో 819 గ్రాముల బంగారం పట్టివేత

నవతెలంగాణ-శంషాబాద్‌
విదేశాల నుంచి అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని శంషాబాద్‌ రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్‌ అధికారులు ఆదివారం పట్టుకున్నారు. కస్టమ్స్‌ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. దుబారు నుంచి ఇండిగో విమానం 6ఈ1466లో ఓ ప్రయాణికుడు అక్రమంగా బంగారాన్ని తరలిస్తున్నాడు. అనుమానంతో అతన్ని అధికారులు తనిఖీ చేశారు. రూ.49.79 లక్షల విలువైన 819 గ్రాముల బంగారం గుర్తించారు. వెంటనే బంగారాన్ని స్వాధీనం చేసుకున్న అధికారులు.. నిందితున్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.