లాసెట్‌కు 83 శాతం హాజరు

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో లా కోర్సుల్లో 2023-24 విద్యాసంవత్సరంలో ప్రవేశాల కోసం నిర్వహించిన రాతపరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని లాసెట్‌ కన్వీనర్‌ బి విజయలక్ష్మి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. లాసెట్‌కు 43,692 మంది దరఖాస్తు చేస్తే 36,218 (83 శాతం) మంది అభ్యర్థులు హాజరయ్యారని పేర్కొన్నారు. 7,476 మంది గైర్హాజరయ్యారని వివరించారు. ఈనెల 29న ప్రాథమిక కీని విడుదల చేస్తామని తెలిపారు. ఈనెల 31న సాయంత్రం ఐదు గంటల వరకు అభ్యంతరాలను స్వీకరిస్తామని పేర్కొన్నారు.