– సమాచార, పౌరసంబంధాలశాఖ కమిషనర్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
నిర్దేశించుకున్న లక్ష్యంలో 92 శాతం కంటి పరీక్షలు పూర్తయ్యాయి. ఈ మేరకు శనివారం సమాచార, పౌర సంబంధాలశాఖ కమిషనర్ అర్వింద్ కుమార్ ఒక ప్రకటన విడుదల చేశారు. కంటి వెలుగు కార్యక్రమంలో ఇప్పటి వరకు ఒక కోటి 54 లక్షల 58 వేల 982 మందికి కంటి పరీక్షలను చేశారు. వీరిలో 21,85,945 మందికి రీడింగ్ గ్లాసెస్ అందజేశారు. 11,862 గ్రామ పంచాయతీ వార్డులు, 3,495 మున్సిపల్ వార్డుల్లో కంటి పరీక్షలు వంద శాతం పూర్తి చేశారు. జూన్ 15 వరకు పరీక్షలను నిర్వహించనున్నారు. ఒక కోటి 15 లక్షల 13 వేల 797 మందికి ఎలాంటి కంటి సమస్యలు లేవని నిర్దారించారు. నివారించదగ్గ అంధత్వరహిత తెలంగాణగా మార్చే లక్ష్యంలో ప్రజలు భాగస్వాములు కావాలని కోరారు.