ఉదయపూర్‌లో 9వ కామన్‌వెల్త్‌ పార్లమెంటరీ సమావేశాలు

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
9వ కామన్‌ వెల్త్‌ పార్లమెంటరీ అసోసియేషన్‌ సమావేశాలు సోమవారం నుంచి 23 తేదీ వరకు రాజస్థాన్‌లోని ఉదయపూర్‌ నగరంలో జరుగుతున్నాయి. ఈ సమావేశాలకు దేశంలోని అన్ని రాష్ట్రాల శాసనమండలి చైర్మెన్లు, డిప్యూటీ చైర్మెన్లు, శాసన సభ స్పీకర్లు, డిప్యూటీ స్పీకర్లతో పాటు ఆయా రాష్ట్రాల శాసనసభ కార్యదర్శులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం నుంచి శాసన మండలి చైర్మెన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి సోమవారం డిజిటల్‌ సాధనాల ద్వారా ప్రజాప్రతినిధులు ప్రజలకు మెరుగైన పరిపాలన అందించే అంశంపై ప్రసంగం చేశారు. ప్రజలకు మెరుగైన సేవలను అందించేందుకు ప్రజా ప్రతినిధులు కూడా డిజిటల్‌ సాధనాలను వాడుకోవాలని ఆయన సూచించారు.