డీజిల్‌ వాహనాలపై అదనపు జిఎస్‌టి..!

న్యూఢిల్లీ : దేశంలో డీజిల్‌ ఇంధనం వాహనాలపై కేంద్ర ప్రభుత్వం అదనంగా 10 శాతం జిఎస్‌టి విధించనుందని వార్తలు వచ్చాయి. డీజిల్‌ వాహనాలను తగ్గించి.. కాలుష్యాన్ని తగ్గించాలనే యోచిస్తోందని ఊహాగానాలు వెళ్లువెత్తాయి. ఈ పరిణామంతో స్టాక్‌ మార్కెట్‌లో వాహన, చమురు మార్కెటింగ్‌ కంపెనీల షేర్లు ఒత్తిడికి గురైయ్యాయి. కాగా దీనిపై స్పందించిన రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ.. ప్రభుత్వం డీజిల్‌ వాహనాలపై ఎలాంటి అదనపు పన్ను వేసే యోచనలో లేదని స్పష్టతనిచ్చారు. అలాంటి ప్రతిపాదనేది తమ వద్ద లేదన్నారు.