ఐఫోన్‌ 14, 13 ధరల తగ్గింపు

న్యూయార్క్‌ : ఐఫోన్‌ 15 సిరీస్‌ విడుదల చేసిన ఆపిల్‌ కంపెనీ.. ఇంతక్రితం ఐఫోన్‌ 14, ఐఫోన్‌ 13 ధరలను తగ్గిస్తున్నట్లు ప్రకటన చేసింది. ప్రతీ సారి కొత్త సిరీస్‌ ఫోన్లను విడుదల చేసిన వెంటనే పాత మోడళ్ల ధరలను తగ్గిస్తోన్న విషయం తెలిసిందే. ఐఫోన్‌ 14 మోడల్‌ 128జిబి బేస్‌ వేరియంట్‌ ధరను రూ.69,900గా నిర్ణయించింది. ఇంతక్రితం దీని ధర రూ.79,900గా ఉంది. ఈ మోడల్‌లో 256బిజి, 512జిబి వేరియంట్ల ధరలు వరుసగా రూ.79,900, రూ.99,900కు తగ్గించింది. వీటి పాత ధరలు రూ.89,000, రూ.109,900గా ఉన్నాయి. ఐఫోన్‌ 13పైన కూడా ఇంతక్రితం ధరతో పోల్చితే రూ.10వేలు తగ్గించింది.