– ఆసియా క్రీడలకు భారత బృందం
న్యూఢిల్లీ : 2023 హౌంగ్జౌ ఆసియా క్రీడల్లో పాల్గొనే భారత అథ్లెట్ల బృందంలో కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ పలు మార్పులు చేసింది. ఆసియా క్రీడల్లో పోటీపడేందుకు కొత్తగా 22 మంది అథ్లెట్లకు అవకాశం కల్పించిన క్రీడాశాఖ.. కోచ్లు, సహాయక సిబ్బందిలోనూ పలు మార్పులు చేసింది. తొలుత వెల్లడించిన జాబితాలో 25 మంది సిబ్బందిని మార్చివేసింది. ఈ మేరకు సవరించిన ఆసియా క్రీడల భారత బృందం జాబితాను శుక్రవారం వెల్లడించారు. సెప్టెంబర్ 23 నుంచి ఆసియా క్రీడలు ఆరంభం కానున్నాయి.