ఆలయ ట్రస్ట్‌ సభ్యుల కొత్త కార్యవర్గం ఏకగ్రీవం

The new working group of temple trust members is unanimousహైదరాబాద్‌: చాదర్‌ఘాట్‌లోని శ్రీరామాలయం, కళ్యాణ మంటపము యొక్క ఆలయ ట్రస్ట్‌ సభ్యులు కొత్త కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టు శుక్ర వారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఆలయ ట్రస్టు అధ్యక్షులు, చైర్మెన్‌గా అంబర్‌ పేట్‌కు చెందిన కృష్ణ, ఆలయ ట్రస్టు ఉపాధ్యక్షులుగా కె.ఎం. సంతోష్‌, ఆలయ కార్యదర్శిగా కె.విజయసాయి, కోశాధికారిగా మహేష్‌, ఆలయ ట్రస్ట్‌ సంయుక్త కార్యదర్శిగా ఎం.ప్రతాప్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్ట్‌ సభ్యుల కొత్త కార్యవర్గాన్ని మాజీ అధ్యక్షులు ఎం.బాగయ్య, చెరుకు కిషన్‌, పి.రాజేందర్‌, పి.సాయిబాబా, ప్రేమ్‌కుమార్‌, శివకాంత్‌ తదితరులు పాల్గొని నూతనంగా ఏకగ్రీవంగా ఎన్నికైన కార్యవర్గాన్ని అభినందించారు.