– జేడీ కార్యాలయం ముందు గొర్రెల మేకల పెంపకందారుల ధర్నా
నవతెలంగాణ -కొత్తగూడెం
గొర్రెలు, మేకల పెంపకందారులకు రెండో విడత గొర్రెలు పంపిణీ చేయాలని గొర్రెల మేకల పెంపకందారుల సంఘం నాయకులు శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జేడీ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బచ్చల కూర శ్రీను, నాయకులు మల్లె బోయిన లింగయ్య మాట్లాడుతూ.. రెండో విడతలో గొర్రెల పంపిణీ ఇంకా చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. డీడీ కట్టిన గొర్ల, మేకల పెంపకం దారులందరికీ వెంటనే గొర్రెలు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తోందని, గ్రామాల్లో రాజకీయ ప్రమేయంతో యూనిట్లు పంచుతున్నారని ఆరోపించారు. తూతూ మంత్రంగా ఒకటి, రెండు యూనిట్లు పంచి అందరిరీ ఇచ్చామని ప్రగర్భాలు పలుకుతున్నారని విమర్శించారు. అనంతరం పశుసంవర్ధక శాఖ జేడీకి మెమోరాండం ఇచ్చారు. జేడీ స్పందిస్తూ.. ఎన్నికలు రాకముందే డీడీ కట్టిన గొర్రెల పెంపకం అందరికీ గొర్రెలు పంచే విధంగా ప్రభుత్వంతో మాట్లాడతా నన్నారు. ఈ కార్యక్రమంలో గొర్రెలు, మేకల, పెంపకందారుల సంఘం నాయకులు రమేష్, నగేష్ తదితరులు పాల్గొన్నారు.