విమోచనం కాదు.. ముమ్మాటికి విద్రోహమే..

నవతెలంగాణ- ఆర్మూర్      
సెప్టెంబర్‌ 17 విలినం కాదు విమోచనమో కాదు ఇది   ముమ్మాటికీ విద్రోహమే ప్రజా పంధా రాష్ట్ర నాయకులు వి ప్రభాకర్ అన్నారు.   పట్టణ కేంద్రంలోని కుమార్ నారాయణ భవన్ లో ఆదివారం సిపిఐ ఎంఎల్ ప్రజా పంధా డివిజన్ కార్యాలయంలో  సెప్టెంబర్‌ 17 విలినం కాదు…విమోచనమో. ..కాదు  తెలంగాణాకు ముమ్మాటికి  విద్రోహమే అని  సెమినర్ నిర్వహిచారు. ఈ సెమినర్ కి ప్రజా పంధా  సబ్ డివిజన్ కార్యదర్శి బి కిషన్  అధ్యక్షత వహించినారు.. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం అమరులేన  వీరులకు 2 నిముషాలు  మౌనం పటిచి  నివాళ్లు   అర్పిచారు. ఈ సెమినర్ లో   ముఖ్య వర్తగా ప్రజా పంధా రాష్ట్ర నాయకులు వి ప్రభాకర్,  డివిజన్ కార్యదర్శి బి. దేవారం  మాట్లాడుతూ..  భారత యూనియన్ ప్రభుత్వం, దేశం నడిబొడ్డున కమ్యూనిస్టు రాజ్య మేర్పడుతుందని భావించి, నాలుగు వైపుల నుండి నైజాం స్టేట్ పై, సైన్యంతో దాడి చేయించింది. కేడర్‌ నష్టం, తీవ్ర నిర్బంధం, సైన్యంతో పోరు, ఇట్టి నేపథ్యంలో పార్టీ 1951లో సాయుధ పోరాటానికి స్వస్తి చెప్పింది.మళ్ళీ టోపీలు మార్చుకొని కాంగ్రెస్ పార్టీ పేర దొరలు, జమీందార్లు, భూస్వాములు సైన్యం కనుసన్నల్లో మళ్ళీ పల్లెలబాట పట్టారు. పేదలకు పంచిన లక్షలాది ఎకరాల భూమి, దోపిడీ నుండి విముక్తమైన 3 వేల గ్రామాలు యూనియన్‌ సైన్యం వల్ల తిరిగి భూస్వాములు, జమీందార్ల చేతుల్లోకి మారాయి. అలా 4 జులై 1946 నుండి మొదలైన సాయుధ పోరాటం గత్యంతరం లేక 25 అక్టోబర్‌ 1951 నాడు విరమించ బడింది. ప్రపంచంలోనే గొప్ప రైతాంగ పోరాటంగా కీర్తించబడ్డ నాటి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం మధ్యలోనే విరమించబడ్డది. ఆనాటి కమ్యూనిస్టు పార్టీ త్యాగం, అచంచల పోరాట పటిమ, ప్రజలు.. ఫ్యూడల్‌ దోపిడీ, పీడనల నుండి విముక్తి పొంది ప్రాణాలను ఫణంగా పెట్టి పార్టీ చూపిన బాటలో పోరాడి ఫ్యూడల్‌, వెట్టి నుండి 3 వేల గ్రామాలు విముక్తం చేయడం, 10 లక్షల ఎకరాల భూమిని దొరలు, భూస్వాములు, జమీందార్ల నుండి లాక్కొని భూమిలేని పేదలకు పంచడం జరిగింది. దేశం నడిబొడ్డున కమ్యూనిస్టు రాజ్యం ఎట్టి పరిస్థితుల్లోనూ ఏర్పడోద్దని భారత పాలకులు, నిజాం రాజు, జమీందార్లు, భారత సైన్యం మూకుమ్మడిగా ఆనాడు తెలంగాణ పల్లెలపై మూకదాడి జరపడం.. దొరలు, భూస్వాముల నుండి లాక్కొన్న భూములను, తిరిగి పేదల నుండి గుంజుకోవడం జరిగింది. తెలంగాణ పల్లెల్లో కాంగ్రెస్‌ ఆహార్యంతో భూస్వాముల వెంట నడిచిన భారత సైన్యం, తన స్వంత ప్రజల మీదనే యుద్ధం చేయడం ఈ తెలంగాణ చరిత్రలోనే మనం చూడగలం అని అన్నారు. చరిత్ర పుటలు తిరగేస్తే భారత సైన్యం ప్రాంత కమ్యూనిస్టులను, సాయుధ రైతాంగాన్ని అణచడానికి వచ్చారని తేటతెల్ల మవుతుంది.
ఆనాటి సైనిక చర్యను ఐక్యరాజ్య సమితి వ్యతిరేకించకుండా.. ఉండటానికి, తమ సైనిక చర్యను, ‘పోలీసు చర్య’గా చరిత్రలో నిక్షిప్తం చేయడాన్ని పాలకుల కుట్రగా చూడొచ్చు. ప్రజలను పీడించి పాలించిన నిజామును 1956 వరకు ‘రాజ్‌ ప్రముఖ్‌’గా గౌరవించి కాపాడారు. నర హంతక ముఠా నాయకుడైన కాశీం రజ్వీ ప్రజల కోపాగ్ని బలి కాకుండా సురక్షితంగా పాకిస్తాన్‌కు చేర్చారు. ప్రజా ద్రోహులను, పీడకులను కాంగ్రేసు, మిలటరీ రెండూ రక్షించి అశేష తెలంగాణ ప్రజలకు ద్రోహం చేశారు. ఇంత చరిత్ర గల్గిన తెలంగాణ (హైద్రాబాద్‌ రాష్ట్రం), ఏనాడూ బ్రిటీష్‌ వలస పాలనలో లేదు. మరి దేశమంతా బ్రిటీష్‌ నుండి విడిపోయి 15 ఆగస్టు 1947వ స్వాతంత్య్రం పొందితే.. తెలంగాణాకు ఆ రోజు ఎలా స్వాతంత్య్ర దినమౌతుందో.. దశాబ్దాలుగా సహేతుకంగా ఆలోచించక పోవడం వింతల్లో కెల్ల వింత.
1948 సెప్టెంబర్‌ 17ను ప్రస్తుత బీజెపి ‘విమోచనా దినం’ అనడానికి ఒకే ఒక్క కారణం.. ఈ ప్రాంతం ముస్లిం పాలన నుండి విడిపడడం. బీజెపి డిక్షనరీలో క్రైస్తవుల నుండి, ముస్లింల నుండి వేరుపడ్డా, విడిపోయినా విముక్తమని అర్థం. ఫ్యూడల్‌ నిజాం నవాబుకు వ్యతిరేకంగా పోరాటం చేసిన కమ్యూనిస్టు పార్టీ 2000 మందిని పోగొట్టుకున్నది. ఆ పిదప  భారత సైన్యం హైదరాబాద్‌ మీద దాడి చేసి 3000  మెత్తం 5000 మంది కమ్యూనిస్ట్  పార్టీ కార్యకర్తలను చంపడం అత్యంత విచారకరం. అని అన్నారు. పోరాటం చేసి, ప్రాణాలు త్యాగం చేసి, పొందిన హక్కులు మళ్ళీ మరో రూపంలో వచ్చిన ఫ్యూడల్‌ శక్తులే లాక్కుంటే.. ప్రజలు విముక్తి పొందినట్లా ? ఒక ప్రాంతం మరో ప్రాంతంలో కలువడానికి కొన్ని షరతులుంటాయి. అవేవీ లేవు కాబట్టి సెప్టెంబర్‌ 17 వీలీనము కానే కాదు. పీడనల నుండి, అరాచకత్వం నుండి ప్రజలు బయటపడితే విముక్తో, విమోచనమో అనొచ్చు. కానీ అదీ జరుగలేదు. కాబట్టి 17 సెప్టెంబర్‌ అటు విలీనమూ కాదు, ఇటు విమోచనమూ కాదు.. అందుకే 17 సెప్టెంబర్‌ 1948 వ రోజు అనెది ముమ్మాటికీ ‘విద్రోహ దినమే’ అని వారు అన్నారు.  ఈ కార్యక్రమంలో,  డివిజన్ నాయకులు ఎం. ముతైన్న ,సబ్ డివిజన్ నాయకులు  ఠాకూర్ ,శేఖర్, రాజన్న గంగన్న, నరేందర్ ,  దుర్గా ప్రసాద్,  పద్మ ,సునీత, పిడియస్యు నాయకులు అనిల్ మమత, విజయ్, నితీష్ ప్రవీణ్  పీవైల్  మనొజ్, విజయ్,అప్పాజల్ , ఇఫ్టు నాయకులు రాజు,నజీర్,గంగన్న  తదితరులు పాల్గొన్నారు.