నవీపేట్ లో అర్ధరాత్రి ఆగని సఫాయి సమ్మె

అర్ధరాత్రి కూడా కొనసాగుతున్న  సఫాయి సమ్మె
అర్ధరాత్రి కూడా కొనసాగుతున్న సఫాయి సమ్మె
నవతెలంగాణ-నవీపేట్: గ్రామపంచాయతీ సిబ్బంది సమస్యల పరిష్కారం కోసం వారం రోజులు చేస్తున్న సమ్మె అర్ధరాత్రి సైతం కార్మికులు సమ్మె శిబిరంలోనే నిద్రపోయి తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. నవిపేట్ గ్రామం స్వచ్ఛ సర్వేక్షన్ గ్రామీణ్ లో ఎంపిక కావడంతో అధికార యంత్రాంగం సమ్మెను విచ్ఛిన్నం చేసేందుకు పోలీసులతో బల ప్రయోగం చేసేందుకు శుక్రవారం యత్నించింది. సమ్మెను విచ్ఛిన్నం చేసేందుకు ప్రయత్నించడంతో కార్మికుల్లో మరింత పోరాట స్ఫూర్తితో సమ్మె శిబిరంలోనే నిద్రించి నిరసన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి న్యాయమైన సమ్మె డిమాండ్లను పరిష్కరించాలని కోరుతున్నారు.
Spread the love