నవతెలంగాణ-మరిపెడ
తెలంగాణ అంగన్వాడీల పోరాటం ఉధృతంగా మారుతుంది. ఈ మేరకు ఆరవ రోజు సమ్మెలో భా గంగా మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేం ద్రంలోని అంగన్వాడి టీచర్స్ అండ్ అల్పర్స్ యూని యన్ అధ్యక్షురాలు బెస్త సంపూర్ణ ఆధ్వర్యంలో అం గన్వాడీల పోరాటాని ఉధృతం చేశారు. ఆదివారం మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై సుమారు గంటపాటు ఎర్రని ఎండని సైతం లెక్కచేయకుండా రోడ్డుపై గంటసేపు రాస్తారోక నిర్వహించారు. జాతీ య రహదారిని దిగ్భందించడం ఏమిటని మహిళా ఉద్యోగులపై ఎస్సై చెయి చేసుకునే ప్రయత్నం చే శారు. మహిళా ఉద్యోగులు చేస్తున్న ఆందోళనకు మ హిళా కానిస్టేబుల్ తీసుకోని రాకుండా వచ్చిన ఎస్‌ఐ అంగన్వాడి ఉద్యోగులు అగ్రహం వ్యక్తం చేశారు. కేసు లు పెడతాం జైల్లో పెడతాం అంటూ ఆందోళన చేస్తు న్న అంగన్వాడి మహిళలను ఎస్సై హెచ్చరించారు. దీంతో పోలీసులకు అంగన్వాడి టీచర్లకు మధ్య వా గ్వాదం జరిగింది. ప్రజా అభిప్రాయాన్ని గమనించిన అంగన్వాడీలు రాస్తారోకోను విరమింప చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షురాలు బెస్త సంపూర్ణ మా ట్లాడుతూ ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి అంగన్వా డీల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకు లు బాణాల రాజన్న మద్దతుగా నిలుస్తూ వారికి సం ఘీభావాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అ బ్బాయి పాలెం సెక్టార్ లీడర్లు రాములమ్మ స్వరూప మంగమ్మ, ధర్మారం సెక్టార్ లీడర్లు నీలమ్మ, లక్ష్మి, ఎ ల్లంపేట సెక్టార్ నాయకురాలుజ్యోతి, కవిత, నిలు కుర్తి సెక్టార్ నాయకురాలు ఉమా, తాళ్ల ఉకల్ సెక్టార్ లీడర్ రమా, స్వర్ణ్ణ, మరిపెడ సెక్టార్ నాయకురాలు కళమ్మ, పుష్ప, తదితరులు ఉన్నారు.
బీఎస్పీ మద్దతు…
మరిపెడ మండల కేంద్రంలో గత ఆరు రోజులు గా అంగన్వాడీ టీచర్లు అండ్ హెల్పర్లు చేస్తున్న న్యా యమైన పోరాటానికి సంపూర్ణ మద్దతును ఇస్తున్నట్లు బిఎస్‌పి మహిళ జిల్లా కన్వీనర్ గూగులోత్ పార్వతి రమేష్ తెలిపారు. ఆదివారం వారు చేస్తున్న రాష్ట్ర రా స్తారోకో మద్దతు ప్రకటించారు. అనంతరం వారి స మ్మెకు సంఘీభావాన్ని ప్రకటించారు. ఈ కార్యక్రమం లో జిల్లా నాయకులు అయినాల పరశురాములు, కా ర్మిక శాఖ విభాగం నాయకులు ఎడెల్లి అఖిల్, ఇతర విభాగాలకు చెందిన జిల్లా నాయకులు పాల్గొన్నారు.
నర్సింహులపేట : గత 7 రోజులుగా అంగన్వా డీ సిబ్బంది తమ డిమాండ్లను తమ సమస్యలను పరి ష్కరించాలని కోరుతూ మెరుపు సమ్మెకు దిగి రిలే నిరాహార దీక్ష చేస్తున్నారు. ఆదివారం మండల కేం ద్రంలో ఎంపీడీవో కార్యాలయం నుండి మెయిన్ సెం టర్ వరకు అంగన్వాడి టీచర్లు ఆయాలు ర్యాలీ తీశా రు.అనంతరం అంగన్వాడి సంఘం అధ్యక్షురాలు సం పేట లలిత మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమం కా లంలో ఉద్యమంలో ముందుండి కొట్లాడిన అంగన్వా డీలకు స్వరాష్ట్రంలో అన్యాయం జరిగిందని ఆమె ఆవే దన వ్యక్తం చేశారు. పెరిగిన నిత్యవసర ధరల వల్ల అంగన్వాడీల యొక్క కుటుంబాలు చాలీచాలని వే త నాలతో పూట గడవని పరిస్థితిలో ఉన్నాయని ఆమె అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి న్యాయ మైన డిమాండ్లను పరిష్కరించాలని ఆమె ప్రభుత్వా న్ని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్య వర్గ సభ్యులు మోహన్, కెవిపిఎస్ జిల్లా సహాయ కార్యదర్శి మందుల యాకుబూ పాల్గొన్నారు.
గార్ల : ప్రభుత్వ సంక్షేమ పథకాలలో తమ వం తు పాత్ర పోషిస్తున్న అంగన్వాడీల సమస్యల పరిష్కా రానికి సీఎం కేసీఆర్ వెంటనే చొరువచూపాలని సిఐ టియు మండల కార్యదర్శి కందునూరి శ్రీనివాస్, అం గనవాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా నాయకురాలు నీలా దేవిలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.రాష్ట్రవ్యాప్త సమ్మెలో భాగంగా తెలంగాణ అం గన్‌వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ అధ్వ ర్యంలో స్దానిక నెహ్రూ సెంటర్‌లో చేపట్టిన నిరవధి క సమ్మె ఆదివారం ఏడవ రోజు బతుకమ్మలతో ప్రద ర్శన నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు.ఈ సందర్భం గా బతుకమ్మలతో పట్టణ పురవీధులలో ప్రదర్శన నిర్వహించి, స్దానిక నెహ్రూ సెంటర్‌లో బతుకమ్మల తో మానవహారం నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు టి.పద్మ, వి.సుజాత,కె.వసంత, బి. క్రి ష్ణ కుమారి, భాగ్య లక్ష్మీ, కనకతార, శ్రీలక్ష్మీ, ఉపేంద్ర, ఎమ్మాల్య పాల్గొన్నారు.