ప్రజలను చంపిన రోజును పండగ ఎలా చేస్తారు..?

How to celebrate the day of killing people..?– సీపీిఐ (ఎంఎల్‌) ప్రజా పంథా జిల్లా సహాయ కార్యదర్శి రవి
నవతెలంగాణ-తొర్రూరు
1948 సెప్టెంబర్‌ 17న ప్రజా కంటక నైజాం నవాబు వల్లభారు పటేల్‌ నా యకత్వంలోని సైన్యం తెలంగాణ ప్రజలను మూడువేల మందిని చంపితే అది పండుగ ఎలా అవుతుందని సీపీిఐ (ఎంఎల్‌) ప్రజా పంథా మహబూబాబాద్‌ జిల్లా సహాయ కార్యదర్శి కొత్తపల్లి రవి ప్రశ్నించారు. సెప్టెంబర్‌ 17 విద్రోహ దినం అం టూ తొర్రూరులోని అమరవీరుల స్తూపం వద్ద ఆదివారం పార్టీ ఆధ్వర్యంలో నిరస న తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన రవి మాట్లాడుతూ భారత సైన్యం తెలంగాణ ప్రాంతంలో గ్రామాలను తగలబెట్టి స్త్రీలపై అత్యాచారా లు చేసి వేలాది మందిని చంపి వారి రక్తాన్ని ఏరులై పారిస్తే సెప్టెంబర్‌ 17న వి ముక్తి అని ఒకరు, సమైక్యత దినమని ఒకరు జరపటం ఆ అమరవీరుల త్యాగాల ను అవమానపరచడమే అవుతుందన్నారు. భూస్వాముల నుండి స్వాధీనం చేసు కున్న పది లక్షల ఎకరాల భూములు సాగు చేసుకుంటున్న దళిత, గిరిజన, బడుగు బలహీన వర్గాల ప్రజల నుండి భారత సైన్యం ఆ భూములను మళ్లీ భూస్వాముల కు అప్పజెప్పటాన్ని తెలంగాణ ప్రజలకు విద్రోహం కాక మరేమిటవుతుందని అ న్నారు. నాటి చారిత్రాత్మక తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట స్ఫూర్తితో నేడు యువతరం కేంద్రంలో బిజెపి అనుసరిస్తున్న దేశద్రోహకరమైన విధానాలను, మ త విద్వేష రాజకీయాలను, ధరల భారాన్ని తిరస్కరిస్తూ ఉద్యమించాలని రవి అ న్నారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో అమరులైన 4000 మందిలో ముస్లింలు, హిందువులు అన్ని కులాల వాళ్ళు ఉన్నారని, అదేవిధంగా తెలంగాణ ప్రాంత ప్రజలను అణచివేసి దోచుకున్న వారిలో హిందూ ముస్లిం మతాలవారు ఉన్నారని ఆయన తెలిపారు. అనంతరం సీపీిఐ (ఎంఎల్‌) ప్రజా పంథా తోర్రూరు డివిజన్‌ కార్యదర్శి ముంజంపల్లి వీరన్న మాట్లాడుతూ రాష్ట్రంలో కెసిఆర్‌ ప్రభు త్వం అర్హులైన పేదలందరికీ గృహలక్ష్మి పథకం కింద దరఖాస్తు చేసుకున్న అర్హులై న వారందరికీ ఇళ్ళు నిర్మించి ఇవ్వాలని, దళిత బంధు,బీసీ బంధు అర్హులైన వారం దరికీ రాజకీయాలకతీతంగా ఇవ్వాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమం లో గుగులోతు పూల్‌సింగ్‌ అధ్యక్షత వహించగా వెంకన్న, యాకన్న, మురళి, హరి, పుల్లయ్య, సతీష్‌, సాంబయ్య, పాష, నెహ్రు, బీమా తదితరులు పాల్గొన్నారు.