చరిత్రను వక్రీకరించే ప్రయత్నాలను ఎదుర్కోవాలి

Attempts to distort history
to face–  గౌని ఐలయ్య
నవతెలంగాణ-కొత్తగూడ
ప్రజలు ఎదుర్కొంటు న్న సమస్యలను పట్టించుకో కుండా ప్రజల దృష్టిని మ ళ్లించడానికి పాలకవర్గ పార్టీ లు చేస్తున్న చరిత్రను వక్రీక రించే ప్రయత్నాలను గట్టిగా ఎదుర్కోవాలని సీపీఐ (ఎంఎల్‌) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి గౌని ఐలయ్య పిలుపు నిచ్చారు. ఆదివారం మండల కేంద్రంలోని న్యూ డెమోక్రసీ పార్టీ పాలడుగు కృష్ణ స్మారక భవనంలో విలీనం కాదు విమోచనం కా దు సెప్టెంబర్‌ 17 ముమ్మాటికి విద్రోహ దినమే అనే అంశంపై సదస్సు నిర్వహిం చారు. ఈ సదస్సుకు ముఖ్యఅతిథిగా హాజరైన గౌని ఐలయ్య మాట్లాడుతూ తెగిం చి పోరాడి సాధించుకున్న తెలంగాణ ప్రజల్లో మత విద్వేషాలను రెచ్చగొట్టే విధా నాలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తు న్న కుట్రలు కుతంత్రాలను, వారు చేసే ప్రయత్నాలను తిప్పికొడుతూ ప్రతిఘటిం చాలన్నారు. హిందుత్వ ప్రచారాలకు మోసపోకుండా సెప్టెంబర్‌ 17ను విద్రోహ దినంగానే జరుపుకోవాలని ప్రజలకు పిలుపు నిచ్చారు. ఈ సదస్సులో నాయకులు పుల్లన్న, బూర్క బుచ్చి రాములు, యాదగిరి యుగంధర్‌, గజ్జి సోమన్న, గట్టి సు రేందర్‌, జోగ రణధీర్‌, ఆగబోయిన నర్సక్క, సిద్ధ బోయిన జీవన్‌, పసునూరి రా జమల్లు, రాసమల్ల శ్రీను, ఈసం జగ్గారావు, ఈసం సారన్న, ఇరుప ముత్తయ్య, తదితరులు పాల్గొన్నారు.
సెప్టెంబర్‌ 17 ముమ్మాటికి విద్రోహమే…
నవతెలంగాణ-మహబూబాబాద్‌
సెప్టెంబర్‌ 17 ను విద్రోహ దినంగా పాటిస్తూ సీపీఐ (ఎంఎల్‌) న్యూడెమోక్ర సీ ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక అంబేద్కర్‌ సెంటర్లో నిరసన కార్యక్రమం నిర్వ హించారు. ఈ నిరసన కార్యక్రమాన్ని ఉద్దేశించి సీపీఐ (ఎంఎల్‌) న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకులు మండల వెంకన్న మాట్లాడుతూ 1948 సెప్టెంబర్‌ 17 ము మ్మాటికీ విద్రోహమే అని తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తితో దోపిడిని అంతం చేసే వరకు బలమైన ప్రజా ఉద్యమాలను నిర్మించాలని పిలుపుని చ్చారు.ఈ కార్య క్రమంలో డివిజన్‌ డివిజన్‌ కార్యదర్శి కామ్రేడ్‌ హలావత్‌ లింగ్యా, ఎస్‌కే బాబు, పర్వత కోటేష్‌, జబ్బార్‌, నిజాముద్దీన్‌, గుండెల కృష్ణ, మంద పద్మ, అల్లి ఏకాంబ రం, జంపాల ఉపేందర్‌ తదితరులు పాల్గొన్నారు.
సెప్టెంబర్‌ 17 ముమ్మాటికి విద్రోహ దినమే…
నవతెలంగాణ-బయ్యారం
సెప్టెంబర్‌ 17 ముమ్మాటికీ విద్రోహ దినమే అని సీపీఐ (ఎంఎల్‌) న్యూడె మోక్రసీ జిల్లా కార్యదర్శి బండారు ఐలయ్య, బయ్యారం ఎస్‌డిఎల్‌సి కార్యదర్శి నం దగిరి వెంకటేశ్వర్లు అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో తెలంగాణ సాయిధ రైతంగా పోరాట అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించారు. ఈ కార్యక్ర మంలో సీపీఐ(ఎంఎల్‌)న్యూడెమోక్రసీ మండల నాయకులు రామచంద్రుల ముర ళి, రాసమల్ల ఉప్పలయ్య, చల్లా కష్ణ, మెరుగుమల్ల శంకర్‌, నందగిరి సత్యం, ఏర్ని వెంకటేష్‌, కొత్త రాందాస్‌, నిమ్మర బోయిన సహదేవ్‌, వల్లాల బిక్షం పాల్గొన్నారు.
సీపీఐ (ఎంఎల్‌) న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో…
సెప్టెంబర్‌ 17 విగ్రహ దినం కార్యక్రమాన్ని సీపీఐ (ఎంఎల్‌)న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో ఆదివారం మండల కేంద్రంలోని గాంధీ సెంటర్‌ తెలంగాణ అమర వీరుల స్థూపం దగ్గర నివాళి అర్పించారు.. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశిస్తూ అఖిల భా రత రైతు కూలీ సంఘం మండల అధ్యక్షులు రామగిరి బిక్షం మాట్లాడుతూ తె లంగాణ ప్రాంతంలో నైజాం రజాకార్లు దోపిడీ దౌర్జన్యాలు, గట్టి చాకిరి, అణచివే తకు అరాచకాలు అరాచకాలకు వ్యతిరేకంగా వారికి వ్యతిరేకంగా సాగిన తెలంగా ణ సాయుధ పోరాటం 1946 నుండి 1952 సాగిన పోరాటం సాగిందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మాధం శెట్టి నాగేశ్వరావు, తుడుం వీరభద్రం, జేర్రిపో తుల బుచ్చయ్య, మురళి, రమేష్‌, శేషు, కూనూరి యుగందర్‌ పాల్గొన్నారు.