బాధిత కుటుంబానికి బియ్యం సరుకుల పంపిణీ

Distribution of rice consignment to the affected family– కొట్ర గ్రామ సేవా సమితి అధ్యక్షుడు రవీందర్‌ రావు ఆధ్వర్యంలో…
వెల్దండ : వెల్దండ మండలం కొట్ర గ్రామ పంచాయతీ పరిధిలోని బుడ్డొన్‌పల్లిలో కుందేళ్ళ పర్వతాలు అనే వ్యక్తి గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఇటీవల మృతి చెందాడు. విషయాన్ని తెలుసుకున్న కొట్ర గామ సేవా సమితి అధ్యక్షుడు పోనుగోటి రవీందర్‌రావు ఆధ్వర్యంలో బాధిత కుటుంబాన్ని పరామర్శించి 25 కేజీల సన్న బియ్యం, తొమ్మిది రకాల నిత్యవసర సరుకులు అందించారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ పార్టీ గ్రామ అధ్యక్షులు కొప్పు వెంకటయ్య కరుణాకర్‌ రెడ్డి, మల్లేష్‌, బాలరాజు, బాల్‌ చంద్రయ్య, నరసింహ, గ్రామస్తులు పాల్గొన్నారు.