అప్పీల్‌కు వెళ్లాలి : టీఎస్‌పీటీఏ

నవతెలంగాణబ్యూరో- హైదరాబాద్‌
ఎల్‌ఎఫ్‌ఎల్‌ హెచ్‌ఎం పదోన్నతుల విషయంలో హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే అప్పీల్‌కు వెళ్లాలని టీఎస్‌పీటీఏ అధ్యక్షులు సయ్యద్‌ షౌకత్‌అలీ, ప్రధాన కార్యదర్శి పిట్ల రాజయ్య డిమాండ్‌ చేశారు. ఆ పోస్టులకు నియామకాలను చేపట్టడం లేదని బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆ నిబంధనలు ఎస్జీటీ నియామకాలకే వర్తిస్తాయని స్పష్టం చేశారు. డీఎడ్‌, టీటీసీ అర్హత కలిగిన వారు పీఎస్‌హెచ్‌ఎం పోస్టులకు అనర్హులని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి ఆర్డినెన్స్‌ జారీ చేసి బీఎడ్‌ అర్హల ఉన్న ఉపాధ్యాయుల హక్కులను కాపాడాలని కోరారు.